బియ్యం ఎగుమతులపై ఇండియా నిషేధం విధించడంతో అమెరికాలో ఒక్కసారిగా వాటి ధరలకు రెక్కులు వచ్చాయి. ఎన్ఆర్ఐలు భారీగా వీటిని కొనుగోలు చేయడంతో స్టాక్ లేదన్న బోర్డులు వెలిశాయి. దేశంలో బియ్యం కొరత అనేది రాదు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధికంగా వరి సాగు చేసేదేశాల్లో భారత్ మొదట ఉంటుంది. ఎంత కావాలంటే అంత బియ్యం అందుబాటులో ఉంటుంది. ఈ ఏడాది పంటలు ఆలస్యమయ్యాయి… కానీ ఆ ప్రభావం వచ్చే ఏడాది కనిపిస్తుందేమో.. ఇప్పుడే ఎందుకు బియ్యం ఎగుమతులపై నిషేధం విధించారు, ముందు జాగ్రత్తగా బియ్యం రేట్లను కంట్రోల్ చేయడానికి ఇలా చేశారు.
నిషేధంపై అతి స్పందనతోనే అసలు సమస్య
ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించిందని ఇక బియ్యం దొరకదన్న అతి ప్రచారంతోనే అసలు సమస్య ప్రారంభమయింది. కానీ ప్రస్తుతం అమెరికాలో 12 వేల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలు ఉన్నాయని ట్రేడర్లు చెబుతున్నారు. వీటితో పాటు 18వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఇంకా రవాణాలో ఉన్నాయి. ఈ నిల్వలు ఆరు నెలలకు సరిపోతాయని ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ట్రేడర్ల భరోసా ఇస్తున్నారు. భారతీయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం త్వరలోనే తగు నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికి ధరల నియంత్రణకే నిర్ణయం తీసుకున్నారు. కానీ ఎన్నారైలో అతి స్పందించడంతో సమస్య వస్తోంది.
ఎన్నారైలు సంయమనం పాటించాలి !
ఎన్ఆర్లు సంయమనం పాటించి అందరికి బియ్యం అందేలా ప్రశాంతంగా ఉండాలని ట్రేడర్లు కోరుతున్నారు. అనవసరంగా బియ్యం కోసం ఎక్కువ ఖర్చు చేయవద్దని, ఈ పరిస్థితి ఎక్కువ కాలం ఉండదని చెబుతున్నారు. సాధారణంగా 9 కేజీల బ్యాగ్ అమెరికాలో 16-18 డాలర్ల వరకు ఉంటుందని, భయంతోజనం ఎక్కువ మోతాదులో కొనుగోళ్లు చేయడంతో వాటి ధర ఒక్కసారిగా 50 డాలర్లకు చేరింది. సాధారణంగా ప్రతి నెల అమెరికాకు మన దేశం నుంచి 6 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతులు అవుతాయి. ఇందులో ఏపీ, తెలంగాణ నుంచి 4వేల మెట్రిక్ టన్నులు ఎగుమతి అవుతున్నాయి. భారతీయులు ఎక్కువగా వినియోగించే సోనామసూరి బియ్యం ఎగుమతులను కేంద్రం అనుమతించే అవకాశం ఉంటుంది.
భారతీయుల్ని కేంద్రం ఎప్పుడైనా పట్టించుకోకుండా వదిలేసిదా ?
మన దేశం నుంచి నెలకు 5 లక్షల మెట్రిక్ టన్నుల బాస్మతీయేతర బియ్యం వివిధ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. విదేశాల్లో ని భారతీయులకే కాదు.. అన్నం మాత్రమే తినే ఇతర దేశాలకు భారత్ కడుపు నింపుతోంది. అయితే భారత్ ముందుగా … ప్రవాసుల కష్టాలను చూస్తుంది. వారికి బియ్యంకొరత ఉంటే తక్షణం ఎగుమతులు చేస్తుంది. కానీ అనవసరం భయంతో వందల కిలోలు కొనుక్కుని దాచి పెట్టుకుంటే.. రేట్లు అసాధారణంగా పెరుగుతాయి. జేబుకు చిల్లు తప్ప ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు.