సీజన్ మారింది, ఇకపై రోజూ ఈ కషాయం తాగితే అనారోగ్యం దరిచేరదు

సీజన్ మారింది. ఎర్రటి ఎండలు తగ్గుముఖం పట్టాయి. వానలు మొదలయ్యాయి. అదే సమయంలో వైరస్ ల దాడి మొదలైంది. అంటువ్యాధులు, రోగాలు బారినుంచి కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అనారోగ్యం చుట్టుముట్టిన తర్వాతై హాస్పిటల్స్ లో చేరి భారీగా చెల్లించుకునేకన్నా ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సీజనల్ వ్యాధులబారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ఓ గ్లాసు శొంఠి కషాయం తాగితే చాలు..

అనారోగ్యం దరిచేరనివ్వని శొంఠి
వానాకాలం మొదలైనప్పటి నుంచీ చలికాలం పూర్తయ్యేవరకూ అంటే దాదాపు 8 నెలల పాటూ చల్లటి వాతావరణం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయి. దగ్గు, జలుబు, జ్వరం, ఊపిరి సరిగా అందకపోవడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఆస్తమా ఉన్నవారి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. వీటన్నింటికీ చెక్ పెట్టేస్తుంది శొంటి కషాయం. నిత్యం ఓ గ్లాస్ శొంఠి కషాయం తాగడం వల్ల ఊపిరితిత్తుల్లో ఎలాంటి సమస్య ఉన్నా తుడిచిపెట్టేస్తుంది. లోపల పేరుకుపోయిన కఫం బయటకు వచ్చేస్తుంది. ద‌గ్గు, జ‌లుబు త‌గ్గుతాయి. ఆస్త‌మా ఉన్నవారికి దివ్య ఔషధం ఇది. శ్వాస సరిగ్గా ఆడుతుంది.

శొంఠి కషాయం ఇలా తయారు చేసుకోండి
రెండు అంగుళాల శొంఠి ముక్కను తీసుకుని…ధ‌నియాలు, జీల‌క‌ర్ర‌, మిరియాల‌ను స్పూన్ చొప్పున వేసి మెత్తగా పొడిచేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని బెల్లంతో స‌హా నీళ్ల‌లో క‌లిపి ఆ నీటిని స్ట‌వ్‌పై పెట్టి బాగా మ‌రిగించాలి. ఆ తర్వాత తులసి ఆకులు వేసి మరో రెండు నిముషాలు మరిగిన తర్వాత స్టౌ ఆపేయాలి. దీనిని వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగేయాలి. పొద్దున్నే తయారు చేసేసుకుని రోజు మొత్తంలో కొంచెం కొంచెం చొప్పున నాలుగైదుసార్లు తాగొచ్చు. ముఖ్యంగా రాత్రి పూట ఇలా తాగితే క‌ఫం స‌మ‌స్య అనేదే ఉండ‌దు. ఊపిరి స‌రిగ్గా అందుతుంది. ద‌గ్గు, జ‌లుబు, ఆస్త‌మా స‌మ‌స్య‌లు ఉండ‌వు. చిన్నారుల‌కు కూడా దీన్ని ఇవ్వ‌వ‌చ్చు. కాక‌పోతే అందులో కాస్త తేనె క‌లిపితే పిల్లలు ఇష్టంగా తాగేస్తారు. ఊపిరితిత్తులు క్లీన్ గా ఉంటే చాలు సగం రోగాలకు చెక్ పడినట్టే కదా అంటారు ఆరోగ్య నిపుణులు. అయితే ఏది తీసుకున్నా ఓ నాలుగైదు రోజుల పాటూ మీ ఆరోగ్యంలో జరిగే మార్పులు గమనించాలి. అప్పుడు మాత్రమే దాన్ని కొనసాగించాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవాలి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం