ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు వారసుల సీజన్ నడుస్తోంది. ఎక్కడికక్కడ అధికార, విపక్ష పార్టీల సీనియర్ నేతలు తమ వారసులను రాజకీయ అరంగేట్రం చేయించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. తమ కుమారులు లేదా కుమార్తెలను వచ్చే ఎన్నికల బరిలో దింపేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి టిక్కెట్ తమకు ఇవ్వకున్నా పర్వాలేదు… కానీ తమ వారసులకు అవకాశం ఇవ్వమంటూ పార్టీ అధినేతలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
టీడీపీలో సీనియర్ నేతలెక్కువ !
చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు వారసుల రాజకీయం నడుస్తోంది. దాదాపు 15 మందికి పైగా సీనియర్ నేతలు తమ వారసులను ఈ సారి ఎన్నికల్లో పోటీ- చేయించాలని బావిస్తున్నారు. ఇప్పటికే కొందరు సీనియర్లు పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. ఏకంగా అధిష్ఠానం పెద్దల దగ్గరే తమ మనసులోని మాటను చెప్పేస్తు వారసులకు లైన్ క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తు న్నారు. అధిష్టానం నుంచి ఎలాంటి క్లారిటీ- రాకున్నా, ఎవరి ప్రయత్నాలు వారు మాత్రం చేస్తున్నారు. గతంలో సైతం కొందరు సీనియర్లు ఈ తరహా ప్రయత్నాలు చేసినా వారిలో చాలా కొద్దమంది మాత్రమే సక్సెస్ అయ్యారు.
యవతకు 40 శాతం సీట్లిస్తామన్న చంద్రబాబు
ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లను కేటయిస్తామని చంద్ర బాబు నాయుడు ప్రకటించారు. సీనియర్ నేతలు ఇదే సరైన అవకాశంగా భావించి తిరిగి ఇప్పుడు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాజకీయ వారసులకు మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలనే ఆలోచనలో మునిగిపోయారు. ఇదే సమయంలో టీ-డీపీ అధిష్టానం కుటు-ంబంలో ఎవరి-కై-నా ఒక్కరికే అవకాశం ఇస్తామని తేల్చిచెప్పింది. అయినా కొందరు రెండు సీట్ల కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకొందరు తమ వారసులకు సీటు దక్కితే చాలు అన్న ఆలోచన వున్నారు. ఈ యనమల, జేసీ బ్రదర్స్, కళా వెంకట్రావు, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాలకు చెందిన నేతలు వున్నారు. యనమల ఈసారి తుని నుంచి తన కుమార్తె దివ్యను బరిలోకి దింపాలనే యోచనలో వున్నారు. ఇప్పటికే ఆమెను నియోజక వర్గం ఇంఛార్జిగా అధిష్టానం నియమించింది.
ఈ సారి వారసులకే చంద్రబాబు ప్రాధాన్యం
జేసీ బ్రదర్స్ తనయులు పవన్, అశ్మిత్ పార్టీ కార్యక్రమాల నిర్వాహణలో ఇప్పటికే బిజీగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల, పాతపట్నం నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి రంగంలోకి దిగేందుకు వారసులు సిద్ధమవుతున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గ టీ-డీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా తరచూ పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. దీంతో ఆయన కుమారుడు రామ్ మల్లిక్ నాయుడు ఇపుడు నియోజకవర్గంలో తండ్రి తరపున పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ చురుగ్గా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీ- చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు తన కుమారుడు చింతకాయల విజయ్ను ఈ సారి అనకాపల్లి ఎంపీగా పోటీ- చేయించే యోచనలో వున్నారు. రాజకీయ వారసుడికి అవకాశం ఇవ్వాలని ఈసారి గట్టిగా పట్టు-బట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.