సెంటిమెంట్ లేని కేసీఆర్ రాజకీయ విలువ జీరో – ఫలితాలు చెప్పింది ఇదే !

తెలంగాణ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పరాజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి.. ప్రజలతో ఎమోషనల్ కనెక్షన్ పోగొట్టుకోవడం అని నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. భారత రాష్ట్ర సమితి పూర్తిగా ప్రత్యేక రాష్ట్రం అనే భావోద్వేగ పునాదుల మీద నిర్మితమయింది. అలాంటి పునాదుల్ని కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా బలహీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని అంతర్థానం చేశారు. ఇప్పుడు టీఆర్ఎస్ లేదు.. భారత రాష్ట్ర సమితి మాత్రమే ఉంది.

తెలంగాణను వదిలేస్తే ప్రజలు ఎలా ఆదరిస్తారు ?

తెలంగాణ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పరాజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి.. ప్రజలతో ఎమోషనల్ కనెక్షన్ పోగొట్టుకోవడం అని నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. భారత రాష్ట్ర సమితి పూర్తిగా ప్రత్యేక రాష్ట్రం అనే భావోద్వేగ పునాదుల మీద నిర్మితమయింది. అలాంటి పునాదుల్ని కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా బలహీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని అంతర్థానం చేశారు. ఏ టీఆర్ఎస్ అయితే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందో ఆ తెలంగాణ పేరును లేకుండా పార్టీ పెట్టి భారత రాష్ట్ర సమితిగా పోటీ చేశారు. దీంతో ఆయనకు తెలంగాణ ప్రజలతో ఎమోషనల్ కనెక్షన్ మిస్సయిపోయింది.

తెలంగాణపై కేసీఆర్ ముద్ర పోయినట్లే !

తెలంగాణ అంటే టీఆర్ఎస్.. టీఆర్ఎస్ అంటే కేసీఆర్. కేసీఆర్ పేరు చెప్పినా.. టీఆర్ఎస్ ను గుర్తు చేసుకున్నా అందరికీ గుర్తొచ్చేది తెలంగాణనే. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ టీఆర్ఎస్‌ను స్థాపించారు. సెంటిమెంట్‌ను రగిలిగించారు. ప్రజలందర్నీ ఏకతాటిపైకి తెచ్చారు. రెండు సార్లు అదే సెంటిమెంట్‌తో అధికారాన్ని చేపట్టారు. కానీ ఇప్పుడు కేసీఆర్ పూర్తిగా తెలంగాణను పక్కన పెట్టి రాజకీయం చేశారు. ఏ టీఆర్ఎస్ అయితే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందో ఆ తెలంగాణ పేరును లేకుండా పార్టీ పెట్టి భారత రాష్ట్ర సమితిగా పోటీ చేశారు. దీంతో ఆయనకు తెలంగాణ ప్రజలతో ఎమోషనల్ కనెక్షన్ మిస్సయిపోయింది.

జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని ప్రయత్నంలో మొదటికే మోసం

కేసీఆర్ జాతీయ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చినప్పుడు చాలా మంది రిస్క్ చేస్తున్నారని అనుకున్నారు. ఎందుకంటే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా మార్చారు. జాతీయ పార్టీలన్నీ దండగ.., తెలంగాణ రాష్ట్ర సమితి మన ఇంటి పార్టీ.,. వేరే పార్టీల మాయలో పడవద్దని కేసీఆర్ చెప్పే మాటలకు ప్రజలు ఎంతో ఆకర్షితులయ్యే వారు. మన పార్టీ అనే భావన.. సెంటిమెంట్ టీఆర్ఎస్‌కు రక్షణ కవచంగా ఉండేది. ఇప్పుడు అది పోయింది. కేసీఆర్ తనకు.. తన పార్టీకి ఇప్పటి వరకూ అండగా ఉన్న కవచకుండలం లాంటి సెంటిమెంట్ ను వదిలేసి ఎన్నికల్లో పోరాడారు. సెంటిమెంట్ లేకుండా గెలవగలిగే శక్తి లేదని తేలిపోయింది. ఇప్పటి వరకూ ఆయన సాధించుకున్న కీర్తి ప్రతిష్టలు కూడా మసకబారే ప్రమాదం ఉంది.