ఏ దేశానికి అయినా పార్లమెంట్ అత్యున్నతం. ఇప్పటి వరకూ ఉన్న పార్లమెంట్ భవనం అవసరాలకు సరిపోవడం లేదని భవిష్యత్‌లో మరింత ఎక్కువ మంది పార్లమెంట్ సభ్యులు అవుతారని కొత్త భవనానికి రూపకల్పన చేశారు. పాత భవనాన్ని కూల్చకుండానే కొత్త భవనం కూడా అందులో భాగమయ్యేలా డిజైన్ చేశారు. ఆదివారం ఈ భవనం ప్రారంభోత్సవానికి ముహూర్తాన్ని నిర్ణయించా రు. ఇప్పుడు దీనిని ఎవరు ప్రారంభించాలనే దానిపై కొత్త వివాదం బయలుదేరింది. ఈ భవన నిర్మాణానికి కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనిని ప్రారంభించడం ఎంతో సముచితమని అధికార పార్టీ, ప్రభుత్వ వర్గాలూ వాదిస్తున్నాయి. కానీ ప్రధాని మోదీ అంటే గిట్టని విపక్షాలు రాష్ట్రపతితో ప్రారంభించాలని లేకపోతే కనీసం స్పీకర్ తో అయినా ప్రారంభించాలని అంటున్నాయి.
ప్రధానమంత్రి ప్రారంభించడం కొత్త సంప్రదాయం ఏమీ కాదు !
ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వారు గతంలో పార్లమెంటు విస్తరణ భవనాన్నీ, గ్రంథాలయా న్ని ప్రారంభించిన సంప్రదాయం ఉంది. 1985లో ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ, 1987లో ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ ఈ రెండింటినీ ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంటు భవనం బ్రిటిష్ కాలం నాటిది. ఇప్పుడు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబిం బించే రీతిలో కొత్త భవనాన్ని నిర్మించారు.ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత పెంచేలా ఉంది. అయినా విపక్షాలు మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకించాలి కాబట్టి వ్యతిరేకిస్తామన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి.
దేశాన్ని అవమానించడమే !
అయితే భారత అత్యున్నత పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి అన్ని పార్టీలు రాకపోవడం అంటే.. దేశ ప్రజాస్వామ్యాన్ని అవమానించినట్లే. నిజానికి ఇలాంటి సమస్యలు ప్రతిపక్ష పార్టీల అహం వల్లనే వస్తాయి. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. పార్లమెంట్ భవనం కొత్తది కట్టాలనుకున్నప్పుడు కేంద్రం అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంది. దేశ ప్రజాస్వామ్యానికి ప్రాణం ఆ పార్లమెంట్ లోనే ఉంటుంది. ప్రతిపక్షం ప్రతీ దాన్ని వ్యతిరేకించడం కాకుండా పద్దతిగా ప్రజాస్వామ్య యుతంగా పోరాడాలి. ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలి. దేశ గౌరవాన్ని నిలబెట్టాలి. ఇందు కోసం కొన్ని సార్లు రాజకీయ ప్రయోజనాల కోణంలో ఆలోచించకూడదు. కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని విపక్ష పార్టీలు ఇది ఆలోచించా్సి లఉంది. దేశం గురించి బయట కూడా అదే చర్చ జరుగుతుంది. దాని వల్ల ఎవరికి లాభం.. రాజకీయంగా ఎవర లాభపడతారో కానీ..దేశానికి మాత్రం అంతర్జాతీయగా చెడ్డపేరు తెచ్చినట్లవుతోంది.. దీనికి బాధ్యత లేని విపక్షాలన్నీ కారణమేనని చెప్పక తప్పదు.
చరిత్రలో నిలిచిపోయే విపక్షాల ప్రవర్తన
విపక్షాల ప్రవర్తన చరిత్రలో నిలిచిపోతుంది. అందులో సందేహం లేదు. కొత్త పార్లమెంట్ భవనం గురించి వందల ఏళ్ల పాటు చర్చ జరుగుతుంది. ఇలా చెప్పుకోవాల్సిన వచ్చి ప్రతీ సారి అక్కడ బీజేపీ మాత్రమే కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కానీ విపక్షాలు కానీ కనపించవు. ఇలాంటి చారిత్ర ఘట్టంలో వారి పార్టీ ప్రస్తాన లేకపోతే .. అసలు ఆ పార్టీ మొదటి నుంచి దేశానికి వ్యతిరేకంగా ఉందని ఎక్కువగానే చెప్పుకుంటారు. చరిత్రలో జరగబోయేది అదే. అందుకే విపక్షాలన్నీ కాత్త పార్లమెంట్ భవనం విషయంలో నైతికంగా పతనమయ్యాయన్న విశ్లేషణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.