ప్రభాస్, విజయ్ సహా టాలీవుడ్ లో ఇంకా పెళ్లికాని ప్రసాదుల లిస్టు పెద్దగానే ఉంది!

టాలీవుడ్ హీరోలు వరుసగా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. ఒకరి తర్వాత ఒకరూ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెబుతున్నారు. నాగశౌర్య నుంచి శర్వానంద్ వరకు కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. రీసెంట్ మంచు మనోష్ రెండో పెళ్లి చేసుకున్నాడు. వరుణ్ తేజ్ నిశ్చితార్థం జరిగిపోయింది ఈ ఏడాది చివర్లో పెళ్లి జరగనుంది. అయినప్పటికీ టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచలర్స్ లిస్టు ఇంకా పెద్దగానే ఉంది. సినిమాల ఆలోచనలో పడి పెళ్లి సంగతి పక్కనపెట్టేస్తున్నారో ఏమో లేటవుతోంది..

ప్రభాస్
మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో మొదటి హీరో ఎవరంటే ఠక్కున చెబుతారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు. 43 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లంటే మాత్రం మెలికల్ తిరిగుతుంటాడు. ఇదిగో అదిగో అనడం తప్ప గుడ్ న్యూస్ చెప్పడం లేదు. పెదనాన్న కృష్ణంరాజు కూడా ప్రభాస్ పెళ్లి చూడాలని తెగ ఆశపడ్డాడు. కానీ ఆ కోరిక తీరలేదు. రీసెంట్ గా తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటా అంటూ షాక్ ఇచ్చిన డార్లింగ్ ఆ శుభఘడియలు ఎప్పుడో మాత్రం చెప్పలేదు

సాయి ధరమ్ -వైష్ణవ్ – అల్లు శిరీష్
ఇక మెగాహీరోల్లో పెళ్లి వయసు వచ్చినా ఆ ఊసే ఎత్తడం లేదు. ఆ మధ్య యాక్సిడెంట్ నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే వరుస ప్రాజెక్టులకు సైన్ చేస్తున్నాడు. తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ పెళ్లి జరగాలంటే ముందు అన్నకి అవ్వాలి కదా. ఇక అల్లువారింట్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచలర్ అల్లుశిరీష్ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. వయసు మీదపడుతున్నా పెళ్లి మాట ఎత్తడం లేదు.

విజయ్ దేవరకొండ
పెళ్లిచూపులు సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ నిజజీవితంలో పెళ్లిచూపులకు ఎప్పుడు వెళతాడో అంటున్నారంతా. రౌడీ హీరో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు కానీ వ్యక్తిగత జీవితంలో నెక్ట్స్ స్టెప్ ఏంటన్నది చెప్పడం లేదు.

రామ్
క్లాస్ గా కనిపించే రామ్ ఇస్మార్ట్ శంకర్ అంటూ తనలో మాస్ అవతార్ ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇప్పుడు ఇస్మార్ట్ సీక్వెల్ తో బిజీగా ఉన్నాడు. వరుస ప్రాజెక్టులైతే అనౌన్స్ చేస్తున్నాడు కానీ పెళ్లిమాటెత్తడం లేదు. చాక్లెట్ బాయ్ లా కనిపించే రామ్ వయసు 30 దాటిపోయింది కానీ ఇంకా ఓ ఇంటివాడయ్యే ఛాయలు కనిపించడం లేదు

తరుణ్
తరుణ్ అంటే ఎవరు అని మాత్రం అడగకండి. అప్పుడెప్పుడో నువ్వేకావాలి, నువ్వులేక నేనులేను అంటూ వచ్చి ఫుల్ యూత్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో. హ్యాట్రిక్ హిట్లతో ఇండస్ట్రీలో దూసుకెళ్లాడు కానీ ఆ తర్వాత ఆ లక్ కంటిన్యూ అవలేదు. కెరీర్ క్లోజ్ అయిపోయింది కానీ పెళ్లి మాట వినిపించలేదు. ఆ మధ్య ఆర్తి అగర్వాల్ పేరు వినిపించింది కానీ వర్కౌట్ అవలేదు.

ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టులో సందీప్ కిషన్, అక్కినేని అఖిల్, బెల్లంకొండ శ్రీనివాస్,అడవిశేష్ ఉన్నారు. అడవిశేష్ కూడా త్వరలో అక్కినేని నాగార్జున మేనకొడలు సుప్రియను పెళ్లిచేసుకుంటాడని అంటున్నారు. అదెప్పుడో చూడాలి. ఏదేమైనా కెరీర్లో బిజీగా ఉన్నారో, పెళ్లిపై అప్పుడే ఆసక్తి లేదో తెలియదు కానీ మూడు పదులు దాటినా పెళ్లిమాటెత్తడం లేదు. మరి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరోలంతా వ్యక్తిగత జీవితంలో మరో అడుగు ముందుకు ఎప్పుడేస్తారో చూడాలి.