ది కేరళ స్టోరీ. హిందూ అమ్మాయిల్ని మతం మార్చి.. ఐసిస్ ఉగ్రవాదులుగా మారుస్తున్న అంశంపై వచ్చిన సినిమా. ఈ అంశం దుమారం రేపుతూండగానే హైదరాబాద్‌లో మరో సంచలనాత్మకమైన విషయాలు వెలుగు చూశాయి. హిందూ అబ్బాయిలే మతం మారి… ఉగ్రవాదులుగా తయారయ్యేందుకు సిద్ధమయ్యారు. మధ్యప్రదేశ్ పోలీసులు .. అత్యంత పకడ్బందీగా సమాచారం సేకరించి.. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ తో కలిసి చేసిన ఆపరేషన్ లో బయటపడిన విషయాలు సంచనాత్మకం అవుతున్నాయి.
ముస్లిం ఉగ్రవాదం పట్ల హిందూ యువకుల్ని ఆకర్షితుల్ని చేస్తున్న సంస్థలు
హైదరాబాద్‌లో పట్టుబడ్డ వారంతా హిజ్బ్ ఉత్ తహ్రీర్ సంస్థతో సంబంధాలు కలిగినట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులంతా మారు పేర్లతో చెలామణి అవుతున్నారు. యాసిర్ ముగ్గురు హిందువులకు బ్రెయిన్ వాష్ చేసి ఇస్లాంలోకి మార్చాడు సౌరబ్ రాజ్ విద్య పేరును మహ్మద్ సలీంగా మార్చాడు. అలాగే దేవి ప్రసాద్ పండా పేరును అబ్దుల్ రెహ్మాన్‌గా, బస్కా వేణు కుమార్ పేరును మహమ్మద్ అబ్బాస్ అలీ మార్చినట్లు గుర్తించారు. హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన ఐదుగురిని మధ్యప్రదేశ్ పోలీసులు భోపాల్‌కు తరలించారు. మతం మార్చుకున్న ముగ్గురు హిందువుల కథలు కేరళ స్టోరీలో అమ్మాయిల్ని పోలి ఉన్నాయి. కేరళలో అమ్మాయిలు అయితే హైదరాబాద్‌లో అబ్బాయిలు ఈ కథలో కీలకం అయ్యారు.
హైదరాబాద్‌లో తరచూ బయటపడుతున్న ఉగ్రకదలికలు
కొంత కాలంగా వీరు కొన్ని ఉగ్రవాద సంస్థల వ్యవహారాలపై ఆకర్షితులై.. ఆయా సంస్థల్లో చేరాలన్న పట్టుదలతో గ్రూపుగా ఏర్పడి హైదరాబాద్ నుంచి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అనుమనిస్తున్నారు. హైదరాబాద్‌లో భారీ ఉగ్రదాడికి ప్లాన్ చేశారని, ఎవరికి వారే సింగిల్‌గా దాడులు చేయాలని ప్లాన్ చేసినట్లు తెలిసింది. కొన్నిచోట్ల డ్రోన్ ద్వారా రెక్కీ చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యాసిర్ బృందం తుపాకులు, కత్తులు, గొడ్డలి, ఎయిర్ పిస్టల్, పిల్లోట్‌ని కొనుగోలు చేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇలాగే హైదరాబాద్ నుంచి కొంత మంది సిరియా వెళ్లి ఐసిస్‌లో చేరే ప్రయత్నాలు చేసినట్లుగా ప్రచారం జరిగింది. కొంత మందిని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఎన్ఐఏ వంటి సంస్థలు పట్టుకున్నాయి.
ఉగ్రవాద సంస్థలపై పటిష్ట నిఘా !
గత ఏడాది ఏప్రిల్‌లో పాతబస్తీకి చెందిన సులేమాన్ అనే ఐసిస్ సానుభూతిపరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐసిస్ కు మద్దతుగా, ఐసిస్ భావజాలాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడు. సులేమాన్ పేరుతో 20 సోషల్ మీడియా ఖాతాలను పోలీసులు గుర్తించారు. ఐపీ అడ్రస్ ఆధారంగా పోలీసులు సులేమాన్ ను అరెస్ట్ చేశారు. దేశంలో ఐసిస్ కదలికల్ని నాలుగు రోజుల క్రితం గుర్తించాయి భద్రతా బలగాలు. ఈనేపథ్యంలో హైదరాబాద్ లో సానుభూతిపరుడిని అరెస్ట్ చేయడం సంచలనం కలిగించింది. టెలిగ్రామ్, ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఐసిస్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. అమెరికాకు వ్యతిరేఖంగా ఐసిస్ తరుపున యుద్ధం చేయాలంటూ.. కామెంట్స్ పెడుతున్నాడు. ఇలాంటి వారిపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టిన కేంద్రం.. త్వరలో అసలు కుట్రను బయట పెట్టే అవకాశాలు ఉన్నాయి.