తెలుగు రాష్ట్రాల్లో ఒంటరిగానే ఏపీ బీజేపీ పోటీ – ఎన్నికల ప్లాన్ ఖరారీ చేసిన హైకమాండ్ ?

భారతీయ జనతా పార్టీ పెద్దలు తెలుగు రాష్ట్రాల బీజేపీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇంత కాలం జాతీయ రాజకీయాలు, పొత్తుల కారణంగా ఎదిగే అవకాశాలపై అంతగా దృష్టి పెట్టలేకపోయారు. కానీ ఇప్పుడు మాత్రం.. పొత్తుల గురించి కాకుండా ఇక ఎత్తుల గురించి ఆలోచించాలని డిసైడయ్యారు. ఈ అంశంపై ఇప్పటికే బీజేపీ వ్యూహకర్తల బృందం ఓ నిర్ణయం తీసుకుంది. ఈ దిశగా ఇప్పటికే పార్టీ నేతలకు సందేశాలు పంపినట్లుగా చెబుతున్నారు.

తెలంగాణలో పొత్తులకు చాన్స్ లేదు…!

తెలంగాణలో పొత్తులకు అవకాశాలు ఉన్నాయి… తెలుగుదేశం పార్టీ సహా మరికొన్ని పార్టీలు కలసి పోటీ చేద్దామని ప్రతిపాదిస్తున్నాయి. కానీ హైకమాండ్ మాత్రం అంగీకరించడం లేదు. తెలంగాణ నేతలు కూడా ఒంటరిపోటీకే మొగ్గు చూపుతున్నట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో పొత్తులు పెట్టుకోవడం వల్ల బలం తగ్గిపోతుందని.. ఇతర పార్టీల మైనస్ లు పార్టీపై పడతాయని .. అదే బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే.. మోధీ క్రేజ్ కలిసి వస్తుందన్న అంచనాలో ఉన్నారు. అందుకే పొత్తుల ఆలోచనలు చేయకుండా గ్రౌండ్ వర్క్ ప్రారంభించుకున్నారు.

ఏపీలో జనసేనను బుజ్జగించే ఆలోచన చేయకూడదని హైకమాండ్ నిర్ణయం ?

కారణం ఏదైనా ఏపీ బీజేపీ … జనసేనతో పొత్తులో ఉంది. కానీ అది పేరుకే. జనసేన పార్టీ బీజేపీతో పొత్తు ఉందన్నట్లుగా వ్యవహరించడం లేదు. పైగా పవన్ కల్యాణ్ తరచూ బీజేపీతో పొత్తులో ఉండటం వల్ల.. ముస్లింలు తనకు దూరమయ్యారని చెబుతూ వ్యతిరిక వ్యాఖ్యలు చేస్తూంటారు. ఈ కారణంగా బీజేపీ కూడా ఆయన విషయంలో భిన్నంగా ఉండాలని నిర్ణయించుకుంది. పొత్తులు..కలిసి పోటీ చేయడం .. కలిసి పనిచేయడంపై బీజేపీ వైపు నుంచి ఎలాంటి చొరవ చూపించకూడదని.. ఆయన వస్తేనే చర్చించాలని నిర్ణయించుకున్నారు. అందుకే … జనసేనను తాము వద్దనుకున్నట్లుగా ఉండేలా… ప్రకటనలు చేస్తున్నారు. కానీ ఒంటరి పోటీకి సిద్ధమవ్వాలన్న సంకేతాలు మాత్రం వచ్చినట్లుగా చెబుతున్నారు.

దీర్ఘ కాలిక వ్యూహం

తెలుగుదేశం రాష్ట్రాలపై బీజేపీది దీర్ఘకాలిక వ్యూహం. ఇప్పటికిప్పుడు ఇన్ స్టంట్ ఫలితాలు రావాలని కోరుకోవడం లేదు. పార్టీ నేతలు ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉండి.. వచ్చి న అవకాశాల్ని అందిపుచ్చుకునేలా కీలక నిర్ణయాలను … పరిస్థితుల్ని బట్టి తీసుకుంటారని.. చెబుతున్నారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ హైకమాండ్ ఇంతకు ముందెన్నడూ ఊహించని ప్లాన్లను అమలు చేయబోతోందని చెబుతున్నారు.