టీడీపీ-జనసేన మధ్య ప్రారంభమైన గేమ్ – చంద్రబాబును తప్పు పట్టిన పవన్ !

టీడీపీ, జనసేన మధ్య ఆల్ ఈజ్ నాట్ వెల్ అని చాలా రోజుల తర్వాత బయటపడింది. ఇంత కాలం కడుపులో కత్తులు పెట్టుకుని హగ్ చేసుకుంటున్నారు కానీ అసలైన తగాదా మాత్రం ఇప్పుడు బయటపడింది. చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారం చేస్తూ అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నారు. మండపేటలో అభ్యర్థిని ప్రకటించడంపై జనసేన చీఫ్ ఫైర్ అయ్యారు. సీట్లు ఇంకా ఖరారు కాలేదు కాబట్టి.. ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందని ఆయన అంటున్నారు.

తొలి సారి చంద్రబాబు తీరును తప్పు పట్టిన పవన్

మండపేట నుంచి చాలా మంది నాయకులు వచ్చారు. చాలా బాధపడిపోతున్నారు. మండపేటలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించడం బాగా లేదన్నారు. నిజంగానే అది చెప్పాల్సింది పార్టీ నేతల అభిప్రాయాలతో ఏకీభవిస్తాను. చాలా ఇబ్బంది పడ్డాం. గత ఎన్నికల్లో 18 శాతం ఓటింగ్ ఉంది. అది ఇవాళ చాలా బలమైనదిగా ఉంది. ఇప్పుడు అది పదిశాతం పెరిగింది. అయితే నేను ఒక నియోజకవర్గం గురించి మాట్లాడితే ఆ ప్రాంత లీడర్నే అవుతాను. నేను రాష్ట్రాన్ని యూనిట్‌గా చూస్తాను . దీని వల్ల కొన్నిసార్లు ఇబ్బంది కలగవచ్చు. పొత్తు ధర్మం ప్రకారం ప్రకటించకుండా ఉండాల్సింది. నేను పార్టీ లీడర్లకు క్షమాపణ చెబుతున్నాను. వచ్చే సమావేశాల్లో మాట్లాడి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం.

రాజోలు, రాజానగరం నియోజకవర్గాలు జనసేనకేనని ప్రకటన

చంద్రబాబు ఓ నియోజకవర్గం అభ్యర్థిని ప్రకటిస్తే.. పవన్ తమ పార్టీకి రెండు నియోజకవర్గాలను ప్రకటించుకున్నారు. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. రాజోలు జనసేన సిట్టింగ్ సీటు అక్కడ గొల్లపల్లి సూర్యారావు టీడీపీ కోసం పని చేస్తున్నారు. అలాగే రాజానగరం నుంచి రెండు సార్లు గెలిచిన పెందుర్తి వెంకటేష్ తో పాటు మరికొంత మంది సీనియర్ నేతలు రెడీగా ఉన్నారు. ఇప్పుడు వారందరికీ పవన్ షాక్ ఇచ్చినట్లయింది.

ఈ విభేదాలు పెరిగిపోతాయా ?

చంద్రబాబు రాజకీయం గురించి తెలిసిన వారికి జనసేనాని ట్రాప్ లో పడ్డాడన్న అభిప్రాయానికి వస్తున్నారు. జనసేన బలాన్ని తక్కువకు చూపి.. అతి తక్కువ సీట్లు ఇస్తారని.. పవన్ ఇప్పటికైనా మంచో చెడో తెలుసుకోవడం మంచిదంటున్నారు. బీజేపీతో పొత్తు వల్ల కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఉంటాయని.. టీడీపీతోనే వెళ్తే.. పార్టీ నిర్వీర్యం అవుతుందన్న సలహాలు వస్తున్నాయి. మరో రెండు, మూడు షాకులు చంద్రబాబు ఇచ్చిన తర్వాత నిజం తెలుసుకుంటారన్న సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి.