కరోనా మహమ్మారిపై పోరాటంలో మహోద్యమం నిర్వహించిన దేశం మనది. కొవిడ్ ను సమర్థవంతంగా నియంత్రించడంలో బీజేపీ నేతృత్వ ఎన్డీయే సర్కారు సూపర్ సక్సెస్ అయ్యింది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా టీకాలు వేయడం వెనుక ఒక కృషీవలుడి సాహస గాథ దాగొంది. ఆయనే భారత ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ.. కరోనాను దేశం నుంచి మెడపట్టుకు బయటకు గెంటిన నాయకుడాయన
220 కోట్లు దాటిన టీకాలు
ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తున్న అంశాల్లో కొవిడ్ వ్యాక్సిన్ కూడా ఒకటని చెప్పాలి. అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది మార్చి 4 నాటికి 220 కోట్ల కొవిడ్ టీకాలు వేశారు. 12 సంవత్సరాల వయసు దాటిన వారిలో 95 శాతం మందికి తొలి డోస్ టీకాలు అందాయి. 88 శాతం మందికి రెండో డోస్ కూడా చేరింది. బూస్టర్ డోస్ అందుకున్న వారి సంఖ్య కూడా ఎక్కువే. తొలుత కోవ్యాక్సిన్, కోవీషీల్డ్ అందుబాటుకు రాగా, తర్వాతి కాలంలో మరికొన్ని టీకాలతో ప్రజలకు ఉపయోగపడ్డాయి. ఈ క్రమంలో రెండు బిలియన్ టీకాలు దాటిన రెండో దేశంగా రికార్డులకెక్కాం.
అహరహం శ్రమించిన మోదీ
భారత్ ను ప్రపంచానికి టీకా రాజధానిగా చేయాలన్న దృఢసంకల్పంతో మోదీ అహర్నిశలు పనిచేశారు. స్వయంగా టీకా పుణె, హైదరాబాద్ ప్రాంతాల్లోని టీకా తయారీ కేంద్రాలను సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు. ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందుతాయని హామీ ఇచ్చారు. వ్యాక్సిన్ టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు ఎలాంటి అవకాశాలను జారవిడుచుకోవద్దని అధికారులను ఆదేశించారు. నెక్ట్స్ జెనరేషన్ స్ట్రాటజీని అమలు చేయాలని సూచించారు. వ్యాక్సిన్ ను అందరికీ అందుబాటుకు తెచ్చే దిశగా వ్యూహాత్మకంగా, దశలవారీగా టీకాలిచ్చారు. తొలుత ఫ్రంట్ లైన్ వారియర్స్ కు అందించడం ద్వారా వారు దేశానికి చేసే అవకాశమిచ్చారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ ఆరోగ్యంగా ఉంటేనే దేశాన్ని కాపాడగలరన్న ఏకైక లక్ష్యంతో మోదీ నేతృత్వ ప్రభుత్వం పనిచేసింది. ప్రధాని నరేంద్ర మోదీ 71వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రికార్డు స్థాయిలో భారత్ ఒక రోజులో 20 మిలియన్లకు పైగా డోస్‌లను అందించి సరికొత్త చరిత్రకు తెరతీసింది. అర్హులైన వయోజనులందరికీ ఉచిత వ్యాక్సిన్ అందించే దిశగా 2022 జూలై 15న మోదీ ప్రారంభించిన కొవిడ్ వ్యాక్సినేషన్ అమృత్ మహోత్సవ్ విజయవంతమైంది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా 75 రోజుల పాటు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ముందు జాగ్రత్త మోతాదు పెంచడానికి మిషన్ మోడ్ లో ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు.
98 దేశాలకు భారత కొవిడ్ టీకా
సర్వే జనా సుఖినోభవంతు అన్నది మోదీ నేతృత్వంలో భారత విధానం. అందరూ సంతోషంగా, సుఖంగా, ఆరోగ్యం ఉండాలని మనం కోరుకుంటాం. ప్రతీ విదేశీ పర్యటనలోనూ ప్రధాని మోదీ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తుంటారు. ఇందులో భాగంగా వ్యాక్సిన్ మైత్రీ కార్యక్రమాన్ని అమలు జరుపుతూ ఇప్పటి వరకు 98 దేశాలకు భారత టీకాను ఎగుమతి చేశారు. దాదాపు 24 కోట్ల డోసుల కొవిడ్ టీకా ప్రపంచ దేశాలకు అందించడంలో ప్రధాని మోదీ చొరవ దాగొన్నదని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ కే బెర్రీ పునరుద్ఘాటించారు. ఐక్యరాజ్యసమితిలో భాగమైన ప్రతీ దేశానికి టీకా పంపాలన్నది భారత ప్రభుత్వ సంకల్పం. అది చాలా వరకు నెరవేరిందనే చెప్పాలి.