ప్రస్తుతం జీవన శైలిలో కడుపు నిండా తిని, కంటి నిండా నిద్రపోయే పరిస్థితి లేదు. అలా ఎవరన్నా ఉన్నారంటే అదృష్ట వంతులనే చెప్పాలి. ఉరకలు పరుగుల జీవితం. లేట్ నైట్ నిద్ర, పొద్దున్నే హడావిడిగా లేవటం, చాలీ చాలని నిద్ర తో అనేక రోగాల బారిన పడుతున్నారు. నిద్ర లేమి వలన స్ట్రెస్ కూడా ఎక్కువ అవుతోంది. ఊబకాయం, డయాబెటీస్ ఎలా అయితే కామన్ అయిపోయాయో నిద్రలేమి కూడా అలానే వేధిస్తోంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరికి ఇదే సమస్య. ఈ సమస్య అంత తేలిగ్గాతీసుకునే విషయం కాదు ఇది చాలా డేంజర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
నిద్ర లేమి తో వచ్చే సమస్యలివే
నిద్ర లేమి వలన ఎన్నో సమస్యలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. హార్ట్ డిసీజ్ లు, ఊబకాయం, అధిక రక్తపోటు, డయాబెటిస్ లాంటి ప్రమాదరకమైన సమస్యల బారిన పడకతప్పదు. అందుకే ఈ సమస్య నుంచి తొందరగా బయటపడేందుకు ప్రయత్నించాలి. నిద్రలేమి సమస్యలను అస్సలు తేలిగ్గా తీసుకోకూడదు. సాధారణంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే డైలీ 8 గంటలు నిద్ర అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కానీ చాలా మంది రోజుకి కేవలం 5 గంటల నిద్రతోనే సరిపెట్టుకుంటున్నారు. పని ఒత్తిడి వల్లనో లేకపోతే డిప్రెషన్ వల్లో ఇంకా రక రకాల కారణాలతో నిద్ర టైం తగ్గిపోయింది.
కంటి నిండా నిద్ర కోసం
ప్రతి ఒక్కరూ నిద్రకు తప్పనిసరిగా కొంత టైమ్ కేటాయించాలి. సేమ్ టైమ్ రెగ్యులర్ గా ఫాలో అయ్యేలా ప్లాన్ చేసుకోవాలి. నిద్రొచ్చే వరకు ఫోన్ చూస్తూ ఉండకుండా ప్రశాంతంగా కళ్ళు మూసుకుని పడుకోవాలి. లైట్ ఆఫ్ చేసి పడుకుంటే తొందరగా నిద్ర పడుతుంది. తిన్నవెంటనే నిద్రపోకూడదు. డిన్నర్ చేసిన ఒక గంట తర్వాత నిద్రకు ఉపక్రమించడం మంచిది. రాత్రి ఎంత తొందరగా నిద్రపోతే ఉదయం అంత తొందరగా నిద్రలేవగలుగుతారు. ఎప్పుడైతే ఎర్లీగా నిద్రలేస్తారో ఆ రోజు ప్రణాళిక మొత్తం పర్ ఫెక్ట్ గా ఉంటుంది. పనిలో చురుకుగా ఉంటారు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
వ్యాయామం
మన జీవన శైలి, ఫుడ్ హాబిట్స్, స్ట్రెస్ , యాంగ్జైటీ లాంటివి నిద్రకు ముప్పు కలిగిస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ నిద్రలేమి సమస్యకు కారణమవుతాయి. వీటినుంచి బయటపడాలంటే డైలీ విధిగా ఎక్సర్సైజ్ చేయాలి. రోజుకు 40 నిమిషాలు వాకింగ్, యోగా, మెడిటేషన్, లాంటివి చేయటం వలన ఒత్తిడి తగ్గుతుంది. బాడీ, మైండ్ ఫ్రెష్ అవుతుంది.
ఆహార నియమాలు
నిద్రకి డిన్నర్ కి కచ్చితంగా కొంత గ్యాపివ్వాలి. అంటే నైట్ టైం తొందరగా తినాలి. ఎందుకంటే రాత్రి టైం ఫుడ్ డైజేషన్ కి ఎక్కువ సమయం పడుతుంది. ఒకవేళ మీరు లేట్ గా తింటే గ్యాస్ట్రిక్, డైజేషన్ లాంటి సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఫుడ్ కూడా బాగా తగ్గించి తినాలి. నైట్ టైం హెవీ ఫుడ్ తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఆల్కహాల్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్, కెఫిన్ లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కార్బోహైడ్రేట్లు ఎక్కువ మోతాదులో ఉండే మిల్క్ తాగితే హాయిగా నిద్రపడుతుంది. హాట్ అండ్ స్పైసీ ఫుడ్ కూడా నిద్రా భంగమే. నైట్ టైమ్ నాన్ వెజ్ కూడా అవాయిడ్ చేస్తే మంచిది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.