తెలంగాణలో వచ్చేది బుల్ డోజర్ సర్కార్ – యూపీ ఫార్ములా !

వ‌చ్చే ఎన్నిక‌ల‌లో బిజెపి తెలంగాణ‌లో బుల్ డోజ‌ర్ ప్ర‌భుత్వం రావాల‌ని ప్ర‌జ‌లంద‌రూ కోర‌కుంటున్న‌ారని.. ఆ కోరికను తాము నెరవేరుస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయి. తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన త‌ర్వాత నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌.. రోజులు లెక్కపెట్టుకోండి. మీ కుటుంబాన్ని ఫామ్‌ హౌస్‌కే పరిమితం చేస్తామని తెలంగాణలో ఒక అడుగు వెనక్కి వేశామంటే పది అడుగులు ముందుకేస్తాం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన నోటి వెంట బుల్ డోజర్ సర్కార్ పేరు వచ్చింది.

అరాచక శక్తులపై బుల్ డోజర్

యూపీలో అరాచక శక్తులపై బుల్ డోజర్ ను ప్రయోగించడం కామన్. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలపై అత్యాచారాలు చేసే వాళ్ల‌ అంతు చూససేదుకు అత్యాచారాలు చేస్తే వారిపై బుల్డోజర్లతో దాడులు చేస్తామని, అత్యాచారాలకు పాల్పడేవారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేసేందుకు సిద్ధమని సంకేతాలు పంపుతున్నారు. తెలంగాణలో మహిళలపై అన్యాయాలు,అక్రమాలు,అత్యాచారాలు పెరిగిపోయాయన్న ఆరోపణలు ఉన్నాయి. మ‌హిళలకు రక్షణ కల్పించే విషయంలో ఉత్తరప్రదేశ్ లోని యోగీ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకునేందుకు బుల్ డోజర్ పదాన్ని కిషన్ రెడ్డి వాడినట్లుగా తెలుస్తోంది. బీజేపీ ప్రభుత్వం వచ్చాక మహిళలను కన్నెతి చూడాలంటే ఆకతాయిలు వణకేలా చేస్తామని చెప్పడమే ఆయన ఉద్దేశం

యూపీలో ప్రజల ఆదరణ !

అరాచక శక్తులను అణిచి వేయడానికి యోగి ప్రభుత్వం అవలంభించిన బుల్ డోజర్ నినాదం బాగా ఉపయోగపడింది. ఒకప్పుడు యూపీ రాజకీయపార్టీలు గ్యాంగ్ స్టర్లను పెంచి పోషించేవి. వారికి ఓటు బ్యాంక్ ముఖ్యం. ఆ కారణంగా ఆ రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోయేవి. ప్రజల జీవనం కష్టంగా మారింది. యోగి సర్కార్ వాటన్నింటినీ తుడిచి పెట్టేసింది. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ అరాచకాలు జరిగినా యోగి సర్కార్ రావాలన్న వాదన వినిపించేంత బలంగా ఆయన గవర్నెన్స్ ఉందంటే అతిశయోక్తి కాదు.

తెలంగాణలోనూ యూపీ తరహా పరిస్థితులు

తెలంగాణలోనూ అధికార పార్టీ నేతలు అరాచకశక్తులుగా మారారన్న ఆరోపణలు ఉన్నాయి. నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. పట్టపగలు లాయర్ దంపతుల్ని హత్య చేసినా పట్టించుకున్నవారులేరు. నిందితుల్ని శిక్షించిన వారు లేరు. ఇక అచ్యాచారాల గురించి చెప్పాల్సి న పని లేదు. ఇలాంటి వాటన్నింటికీ బుల్ డోజర్ సర్కారే పరిష్కారమని కిషన్ రెడ్డి అంటున్నారు. ప్రజల కోరుకుంటే… ఆ సర్కార్ రావడం ఒక్క బ్యాలెట్ దూరంలోనే ఉంటుంది