తెలంగాణ కమ్యూనిస్టుల పరిస్థితి ఘోరంగా మారింది. మొదట బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ హ్యాండిచ్చాయి. ఆ పార్టీతో ఉపయోగం లేదని నిర్దారిచుకున్నాయి. దీంతో బీజేపీ ని ఓడించడానికి ఏమైనా చేస్తామంటూ సీపీఎం నేతలు కొత్త మాటలు చెబుతూ ఉన్న పరువు కూడా తీసుకుంటున్నారు.
సీపీఎం బెదిరింపులు – సీపీఐ బతిమలాటలు
ఉభయకమ్యూనిస్టు పార్టీలు ఎవరు రెండు సీట్లు ఇస్తే వాళ్లకే మా ఓట్లు అని బతిమాలుకుంటున్నారు. వాళ్లకు ఏమైనా ఓట్లు ఉన్నాయో లేదో ఎవరికీ తెలియదు. కానీ బెదిరింపులు మాత్రం ఓ రేంజ్ లో చేస్తున్నారు. కాంగ్రెస్ ను బ్లాక్ మెయిల్ చేసేందుకు సీపీఎం ఓ లిస్ట్ రిలీజ్ చేసింది. సీపీఐ పార్టీ ఇంకా నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. రెండు రోజులు ఎదురు చూస్తామని ఆ పార్టీ నేత నారాయణ ప్రకటించారు. కాంగ్రె్స సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ జిల్లాలో కమ్యూనిస్టు నేతలకు సీట్లే కేటాయింపును తీవ్రంగా వ్యతిరేకించారు. లెఫ్ట్ పార్టీలతో పొత్తు అవసరం లేదన్నారు. నాలుగు సీట్లు ఇస్తే ఓడిపోతారని జోస్యం చెప్పారు. ఆ పార్టీలకు ఓటు బ్యాక్ లేదన్నారు. దీంతో కాంగ్రెస్ కమ్యూనిస్టుల పరువు తీసినట్లయింది.
మొదట బీఆర్ఎస్ గుమ్మం దగ్గర ఎదురు చూపులు
కమ్యూనిస్టు పార్టీ నేతలు మొదట బీఆర్ఎస్ తో పొత్తులు పెట్టుకోవాలనుకున్నారు. మునుగోడు ఉపఎన్నికల సమయంలో… బ ీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ ప్రత్యేకంగా కమ్యూనిస్టు పార్టీల నేతల్ని ఆహ్వానించి పొత్తులు పెట్టుకున్నారు. మునుగోడులో మాత్రమే కాదని.. తర్వాత కూడా కలిసి పని చేద్దామని ఆయన హామీ ఇచ్చారు. దాంతో మునుగోడులో బీఆర్ఎస్‌కు కమ్యూనిస్టులు మద్దతు ఇచ్చారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయానికి కమ్యూనిస్టులతో పూర్తిగా తెగదెంపులు చేసుకున్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పూర్తి స్తాయిలో అభ్యర్థులను విడుదల చేశారు. దీంతో మోసపోయామనుకున్న కమ్యూనిస్టులు..తర్వాత తాము మాత్రమే కలిసి పోటీ చేయాలనుకున్నారు. ఇండియా కూటమిలో కలిసి పని చేస్తున్నందున .. కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయాలని తర్వాత భావించి చర్చలు జరిపారు. చెరో రెండు సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ అంగీకరించినా తర్వాత పరిస్థితి మారిపోయింది. ఆ పార్టీకి బలం లేదని అవమానించి ఏ విషయం చెప్పడం లేదు.
బూజుపట్టిన సిద్ధాంతాలతో దేశ రాజకీనికి భారంగా కమ్యూనిస్టులు
మాట్లాడితే చైనాను పొగడటం తప్ప ఏమీ చేయలేని కమ్యూనిస్టులు పార్టీలు దేశ రాజకీయానికి భారంగా మారాయి. ఇప్పుడు ఎక్కడా కమ్యూనిస్టుల్ని ప్రజలు నమ్మడం లేదు. అందరూ దూరంగానే పెడుతున్నారు. నమ్మిన సిద్ధాంతాలను పట్టించుకోక రాజకీయల కోసం ఎవరితో పడితే వారితో కలుస్తూ ఉండటంతో… ఆ భావజాలం ఉన్న వారు కూడా… మారిపోతున్నారు. చివరికి కమ్యూనిస్టు పరిస్థితి ఎటూ కాకుండా పోతోంది.