విద్యార్థులకు సందేశమివ్వటానికి ఎలాంటి వ్యక్తులను అతిథిగా పిలవాలో కూడా వైస్ ఛాన్సలర్లకు రాజశేఖర్ గారికి తెలియకపోతే, మీ లాంటి వ్యక్తి ఆ పదవికి అర్హులా అని ప్రశ్నించిన బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి.
నాగార్జున విశ్వవిద్యాలయంలో నిన్న జరిగిన సమావేశానికి వచ్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మా లాంటి బాద్యతలేని అతిథి తప్పుగా సందేశమిస్తున్నా అక్కడున్న ఒక్కరు కూడా అడ్డుకోలేదు. అలాంటి తప్పుడు సందేశాలను అక్కడున్న ఉపాధ్యాయులు కూడా సమర్థిస్తారా? వారి పిల్లలకు, వారి కుటుంబ సభ్యులకు కూడా అలాంటి మాటలే చెప్పి ప్రోత్సహిస్తారా? దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులను ఎటువైపు నడిపించాలనుకుంటున్నారు?
దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే విశ్వవిద్యాలయంలో తప్పుడు అతిథికి అవకాశం ఇచ్చిన బాద్యతారాహిత్యమైన వీసీ పై తక్షణమే చర్యలుతీసుకోవాలని రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఛాన్సలర్ అయినటువంటి రాష్ట్ర గవర్నర్ గారిని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ రాష్ట్ర పార్టీ డిమాండ్ చేస్తుంది అన్న విష్ణువర్ధన్ రెడ్డి.