ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి అనే మాట వినిపించి చాలా కాలం అయింది. ప్రజలకు డబ్బులు పంచితే చాలన్నట్లుగా వైసీపీ సర్కార్ తీరు ఉంది. అయితే ఏపీలో అభివృద్ధి జరగడం లేదా అంటే… జరుగుతోంది. అబ్బురపడే అభివృద్ధి కనిపిస్తోంది. కానీ ఇది అసలు రాష్ట్రానికి సంబంధం లేని అంశాల్లో .. ప్రాజెక్టుల్లోనే. రాష్ట్ర ప్రమేయం ఉంటే పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురవుతోంది. ఇప్పుడీ అభివృద్ధి గురించే ఏపీలో చర్చ జరుగుతోంది.
పూర్తి స్థాయిలో ఆధునాతనంగా రైల్వే స్టేషన్లలు
రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి అమృత భారత స్టేషన్స్ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 1275 రైల్వే స్టేషన్లను ఆధునీకరించాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఈ నిర్ణయంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 72 రైల్వే స్టేషన్లను ఎంపిక చేసి వాటి రూపురేఖలను మారుస్తోంది. వీటి ప నులు శరవేగంగా సాగుతున్నాయి. అమృత్ భారత్ కింద అభివృద్ధి చేసే రైల్వే స్టేషన్లలో కల్పించే కొన్ని మౌలిక సదుపాయాలను చూసినట్లయితే ప్రతి స్టేషన్లలో అవసరమైన భవనాల నిర్మాణం, అధునాతన శైలిలో ఫ్లోరింగ్ చేయనున్నారు. ప్రస్తుతం 600 మీటర్ల పొడుగుతున్న ప్లాట్ ఫామ్ లను 760 మీటర్ల నుంచి 840 మీటర్ల వరకు అవసరం మేరకు పెంచనున్నారు. ప్రయాణికులు తాకిడి ఎక్కువగా ఉండే ఎన్ ఎస్ జీ 1- 4, ఎన్ జీ 1-2 కేటగిరి స్టేషన్లలో ఎస్కలేటర్లను ఏర్పాటు చేస్తున్నారు.
ఏపీలో విమానాశ్రయాల అభివృద్ధి
ఏపీలో విమానాశ్రయాస అభివృద్ధికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది. తిరుపతిలో ఇంటర్నేషనల్ టెర్మినల్ నిర్మాణం పూర్తి అయింది. విస్తరణ పనులు జోరుగా సాగుతోంది. కొన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు ఎప్పుడో అంతర్జాతీయ హోదా ఇచ్చారు. అతి పెద్ద విమానాలు కూడా దిగేలా… విస్తరణ చర్చలు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. కొన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇక విశాఖ దగ్గర బోగాపురం ఎయిర్ పోర్టు కోసం కేంద్రం అన్ని సహకారాలు అందిస్తోంది. అక్కడ జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే సాగుతోంది. రాష్ట్రం రివర్స్ టెండర్ల పేరుతో అభివృద్ధి ఆపకపోతే.. ఈ పాటికి బోగాపురం ఎయిర్ పోర్టు కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చి ఉండేది. ల
సంక్షేమ పథకాలూ కేంద్ర నిధులతోనే !
ఏపీలో అమలు అవుతున్న ప్రతి సంక్షేమ పథకానికి నిధులు కేంద్రానివే. రాష్ట్రానివే అన్నట్లుగా మభ్య పెట్టి రాష్ట్రం ప్రజల్ని మోసం చేస్తోంది. టిడ్కో ఇళ్ల నుంచి ఆయుష్మాన్ భారత్ వరకూ అనేక రకాలుగా ప్రజలకు కేంద్రం నిధులు అందిస్తోంది. ఆ నిజాలను ప్రజలకు చెప్పకుండా రాష్ట్ర సర్కార్ దాచి పెడుతోంది.కేంద్ర మంత్రులు పర్యటనలకు వచ్చినప్పుడు ఈ విషయం తెలిసి మండిపడుతున్నారు. నిధులు ఆపేస్తామని హెచ్చరికలు జారీ చేయడంతో… అప్పటికప్పుడు మోదీ ఫోటోలు పెడుతున్నారు. మళ్లీ మామూలే.
ఎన్నికల సమయంలో ఏపీ ప్రభుత్వ వ్యవహారాశైలిపై మరోసారి తీవ్రమైన చర్చ జరుగుతోంది. నిధుల్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేస్తోందని ప్రజలకు అర్థమవుతోంది. అసలైన అభివృద్ధి పేరుతో ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి వంటి నేతలు సోషల్ మీడియాలో పెడుతున్న ఫోటోలతో… ప్రజలకు నిజాలు తెలుస్తున్నాయి.