తెలంగాణ బీజేపీ వెనుకబడిపోయిందన్న మీడియా ప్రచారాల్ని తలకిందులు చేసేందుకు బీజేపీ నేతలు రెడీ అయ్యారు. హైకమాండ్ త్రిశూల వ్యూహంతో రంగంలోకి దిగింది. ఓ వైపు రాష్ట్ర బీజేపీ నేతల రాజకీయం.. మరో వైపు కేంద్ర మంత్రుల పర్యటనలు.. అదే సమయంలో మొత్తం ఎన్నికలను సమన్వయ పరిచేందుకు కేంద్ర కమిటీ ని రెడీ చేశారు. ఈ వ్యూహం తక్షణం అమలు ప్రారంభమయింది కూడా.
తెలంగాణ బీజేపీ నేతల సమైక్య పోరాటం
తెలంగాణ బీజేపీ నేతలంతా ఇప్పటికే గ్రౌండ్‌లోకి దిగిపోయారు. ప్రజాబలం ఉన్న వారంతా వారి వారి నియోజకవర్గాల్లో పని చేసుకుంటున్నారు. జిల్లా స్థాయి నేతలు అదే పని చేస్తున్నారు. తమ నియోజకవర్గంతో పాటు ఇతర నియోజకవర్గాల బాధ్యతలు తీసుకుంటున్నారు. బలమైన అభ్యర్థులా కాదా అన్నది కాకుండా పార్టీకి ఎంత విధేయంగా ఉంటారన్నదే ప్రామామికంగా తీసుకుంటున్నారు. బీజేపీ బలం.. మోదీ చరిష్మాతోనే గెలిపిస్తుందని భావిస్తున్నారు. రాష్ట్ర స్థాయి నేతలు… అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలపై దృష్టి పెట్టారు. నేతలంతా సమైక్యంగా పని చేస్తున్నారు. మరో మాట లేకుండా గెలిచితీరుతామన్న సంకల్పంతో ఉన్నారు.
అగ్రనేతల వరుస పర్యటనలు
ప్రధాని మోదీ సహా అగ్రనేతలు, కేంద్రమంత్రులంతా వరుస పర్యటనలకు రాబోతున్నారు. మూడు రోజుల వ్యవధిలో ప్రధాని మోదీ రెండు సార్లు తెలంగాణకు వస్తున్నారు. అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో సహా చాలా మంది ప్రచార బరిలోకి దిగనున్నారు. ఢిల్లీ బీజేపీ ఆఫీసులో తెలంగాణ ఎన్నికల కోసం ప్రత్యేకమైన వ్యూహ కమిటీ ఏర్పాటయింది. అక్కడ్నుంచే అన్ని వ్యవహారాలు చక్క బెడతారు
చురుగ్గా వ్యవహరించనున్న కేంద్ర కమిటీ
తాజగాగా ఇరవై ఆరు మందితో కేంద్ర కమిటీని నియమించారు. ఇందులో ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు , జాతీయకార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజుతో పాటు ప్రస్తుత ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డికి కూడా చోటు లభించింది. ప్రచారంతో పాటు ఎలక్షనీరింగ్.,.. నేరుగా ఓటర్లను కలవడం సహా అనే అంశాలను వీరు సమన్వయం చేసుకుంటారు. రెండు నెలలు తెలంగాణలోనే మకాం వేసి … ఈ టీం పని చేస్తుంది.
బీజేపీ వెనుకబడిందంటూ.. ఓ వర్గం మీడియా చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేలా… బీజేపీ ఎంత బలంగా ఎన్నికల రేసులో ఉందో చెప్పేందుకు… అతి కొద్ది రోజుల్లోనే కీలక పరిణామాలు చోటు చేసుకంటాయని బీజేపీ నేతలు నమ్మకంగా ఉన్నారు