రోజూ ఉదయం నిద్ర లేవగానే చాలా మందికి టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది. సమయానికి టీ, కాఫీలు పడకపోతే బ్రెయిన్ పనిచేయదు. కొందరు రోజుకి రెండు మూడుసార్లు మాత్రమే తాగుతారు కానీ ఇంకొందరు రెండు మూడు గంటలకోసారి సేవిస్తుంటారు. ఆరోగ్యం-అనారోగ్యం సంగతి పక్కనపెడితే ఎందులోనైనా అతి పనికిరాదు. అందుకే టీ కాఫీలు ఎక్కువగా తాగే అలవాటు ఉండేవారు అవి తగ్గించి మధ్యలో బనానా టీ ట్రై చేయండి. ఆరోగ్యానికి కూడా చాలామంచిదంటున్నారు నిపుణులు.
బనానా టీ ఇలా తయారు చేసుకోండి
ముందుగా ఒక పాత్ర తీసుకుని అందులో నీళ్లను పోసి మరిగించాలి. మరిగిన నీళ్లలో అరటిపండు ను కట్ చేసి వేసి మరో పావుగంట మరిగించుకోవాలి. ఆ నీటిని వడకట్టి అందులో దాల్చినచెక్క పొడి, అవసరం అనుకుంటే తేనె కలుపుకుని తాగొచ్చు. దీనిని గోరువెచ్చగా తాగాలి. అయితే అరటి పండును తొక్కతో సహా వేయొచ్చు వేదంటే తొక్క తీసి కేవలం పండును మాత్రమే వేసి మరిగించుకోవచ్చు. రుచిగా ఉండాలంటే కేవలం పండు వేసి మరిగించుకోవాలి…పోషకాలు ఫుల్ గా కావాలంటే తొక్కతో సహా వేయాలి. ఎంతో టేస్టీగా ఉండే ఈ టీ రోజుకో కప్పు తాగితే చాలా ఆరోగ్యం.
బనానా టీ తాగితే ప్రయోజనాలివే
@ అరటి పండు టీ తాగడం వల్ల చక్కెరపై వ్యామోహం తగ్గుతుంది..దీంతో తియ్యటి పదార్థాలు తక్కువగా తింటారు.
@ స్వీట్స్ తగ్గించడం వల్ల బరువు తగ్గుతారు..భవిష్యత్ లో షుగర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి
@ అరటి పండు టీలో ట్రిప్టోఫాన్, సెరటోనిన్, డోపమైన్ అనే మజిల్ రిలాక్సంట్స్ ఉంటాయి. ఇవి మనస్సును ప్రశాంతంగా మారుస్తాయి. ఫలితంగాదీంతో ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. మనస్సు ప్రశాంతంగా మారి నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.
@ నిత్యం అరటి పండు టీని తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఎర్ర రక్త కణాలు అధికంగా ఉత్పత్తి అవడంతో రక్తహీనత నుంచి బయట పడవచ్చు.
@ ఈ టీ తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. బీపీ నియంత్రణలోకి వస్తుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
ఇన్ని ప్రయోజనాలున్న అరటిపండు టీని రోజుకో కప్పు తాగితే మంచిదే అంటారు ఆరోగ్య నిపుణులు..
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.