కాంగ్రెస్‌తో టీడీపీ లోపాయికారీ ఒప్పందాలు – ఏపీలో జరుగుతున్న రాజకీయం అదేనా ?

ఏపీలో కాంగ్రెస్ పార్టీ షర్మిలను చేర్చుకుని బలపడే ప్రయత్నం చేస్తోంది. ఇందుకు టీడీపీ వైపు నుంచి సోషల్ మీడియాలో మద్దతు లభిస్తోంది. షర్మిలకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఇంత కాలం శత్రువులుగా ఉన్న వారు… ఎదురెదురుగా మాట్లాడుకుంటున్నారు. ఈ అంశాలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.

కాంగ్రెస్ తో పొత్తుల దిశగా టీడీపీ

ప్రస్తుతం టీడీపీ జనసేన పార్టీతో ఉంది. సీట్ల ఖరారు దిశగా సాగడం లేదు. దీంతో జనసేనలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ కాంగ్రెస్ తో వెళ్లేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని చెబుతున్నారు. షర్మిల ఏపీ పగ్గాలు చేపడితే.. కొన్ని సీట్లుకాంగ్రెస్ కు ఇచ్చి.. పోటీ చేయాలనుకుంటున్నారని.. అదే జనసేనకు అయితే… యాభై సీట్ల వరకూ ఇవ్వాల్సి వస్తుందని అనుకుంటున్నారని అంటున్నారు. దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు కానీ.. జరుగుతున్న పరిణామాలు మాత్రం అదే విషయాన్ని బలపరుస్తున్నాయని అంటున్నారు.

జనసేనపై సోషల్ మీడియాలో టీడీపీ యుద్ధం

జనసేన సోషల్ మీడియాపై టీడీపీ సోషల్ మీడియా ప్రణాళికాబద్దంగా దాడి చేస్తోంది. పవన్ ఇమేజ్ ను తగ్గిచేలా వ్యవహరిస్తున్నారు. జనసేన ప్రభావం పెద్దగా లేదనిప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి ఎవరూ జనసేనలో చేరకుండా తమ పార్టీలోకి పిలిచి కండువాలు కప్పుతున్నారు. ఈ వ్యవహారం జనసేన వర్గాలకు కూడా తేడాగా అనిపిస్తోంది. ఏదో జరుగుతోందని నమ్ముతున్నారు. దీనిపై పవన్ ఇంకా స్పందించలేదు. టీడీపీ ప్రచార కార్యక్రమాల్లో పవన్ కు పెద్దగా ప్రాధాన్యత లభించడంలేదు. సీట్లసర్దుబాటు గురించి అంతంతమాత్రంగా స్పందిస్తున్నారు.

టీడీపీ కాంగ్రెస్ తో వెళ్తే జనసేన కటీఫ్ ఖాయం

కాంగ్రెస్ పార్టీతో టీడీపీ అంటకాగితే.. జనసేన మాత్రం.. టీడీపీతో వెళ్లే అవకాశం లేదని భావిస్తున్నారు. దీనికి సంబంధించి జనసేన పార్టీలో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. టీడీపీ కాంగ్రెస్ తో అంటకాగితే.. వదిలించుకోవడానికి రెడీగా ఉండాలని పవన్ కూడా చెబుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఏపీ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.