వైసీపీలో తమ్మినేని సీతారాంది ప్రత్యేక శైలి. ఆయన చాలా సీనియర్ నేత అయినప్పటికీ ఏ మాత్రం బేషజాలు లేకుండా జగన్ ను ఆకాశానికి ఎత్తేస్తారు. చంద్రబాబును దారుణంగా తూలనాడతారు. తాను స్పీకర్ పదవిలో ఉన్నానన్న విషయాన్ని ఆయన గుర్తుంచుకోరు. అయితే ఆయన ఎంత విధేయత చూపినా ఈ సారి టిక్కెట్ కష్టమేనన్న అభిప్రాయం వైసీపీలో వినిపిస్తోంది. దీనికి కారణం నియోజకవర్గంలోని పరిస్థితులు.
తమ్మినేనికి వ్యతిరేకంగా కూటమి కట్టి నేతలు
తమ్మినేని సీతారాం వ్యవహారశైలి కారణంగా క్యాడర్ చాలా వరకూ ఆయనకు దూరంగా జరిగారు. నియోజకవర్గంలో సువ్వారి గాంధీ రూపంలో వైసీపీలోనే వ్యతిరేక గ్రూపు పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయనకు షాక్ ఇస్తున్నారు. సువ్వారి గాంధీ నాలుగు మండలాల్లో కార్యకర్తలకు అండగాఉంటున్నారు. పెద్ద ఎత్తున సాయం చేస్తున్నారు. పార్టీలో ముఖ్యమైన నేతల అండదండలు, మద్దతు ఉండటం వల్లనే సువ్వారి గాంధీ రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారనీ, ఆ క్రమంలోనే భారీ స్థాయిలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్న టాక్ కూడా నియోజకవర్గంలో నడుస్తొంది. మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావులతో సువ్వారికి మంచి సంబంధాలు ఉన్నా/f.
ఇతర నేతలూ తమ్మినేనికి దూరమే !
మరో వైపు గత ఎన్నికల్లో తమ్మినేని విజయం కోసం పని చేసిన కోట గోవిందరావు బ్రదర్స్ ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. తమ్మినేని పాల్గొనే కార్యక్రమాలకు వారు దూరంగా ఉంటున్నారు. తమ సొంత కార్యక్రమాలలో తమ్మినేని ఫొటో లేకుండా వారు జాగ్రత్తపడుతున్నారు. ఆముదాలవలస, పొందూరు, బూర్జ, సరుబుజ్జిలి మండలాల్లో కూడా ద్వితీయ శ్రేణి నేతలు తమ్మినేని వ్యవహారంపై గుర్రుగా ఉన్నారట. వచ్చే దఫా ఆయనకు టికెట్ దక్కకుండా ఉండేందుకు వీరంతా వ్యూహాలు పన్నుతున్నారట. స్పీకర్ పొజిషన్ లో ఉన్నా.. పట్టించుకోకుంా.. వేరువేరు గ్రూపులు కార్యక్రమాలను నిర్వహించడం తమ్మినేని వర్గీయులను ఆందోళనకు గురి చేస్తొందని అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో సువ్వారి గాంధీ, కోట గోవిందరావ బ్రదర్స్ తనకు పోటీ అవుతారని భావించి సీతారామ్ అనేక విధాలుగా అణగదొక్కాలని ప్రయత్నాలు కూడా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
కుదిరితే ఎంపీ టిక్కెట్ లేకపోతే ఎమ్మెల్సీ ?
తమ్మినేని బలమైన ముద్ర.. క్యాడర్ లో పట్టు శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు సహా, ఆముదాలవలస నియోజకవర్గంలో కూడా ఉంది. కానీ అది గెలుపు ఇస్తుందా అన్నదే డౌట్. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకు టిక్కెట్లు ఇస్తామని జగన్ చెబుతున్నారు. మొహమాటలేమీ ఉండవంటున్నారు. సర్వేల్లో అనుకూలత రాకపోతే.. ఇప్పుడు ఉన్న పరిస్థితులు చుస్తే ఉండక పోవచ్చు అని అంటున్నారు. తమ్మినేని అనుభవ రీత్యా శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పంపించే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. అదీ కుదరకపోతే ఆయనకు ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చిన పక్కన పెట్టే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.
సెంటిమెంట్ ప్రకారం.. స్పీకర్ గా పని చేసిన వారు గెలవరు.. ఈసారి తమ్మినేని టిక్కెట్ దక్కడం కూడా గగనం అవుతోంది.