శరీరం చురుగ్గా పనిచేయలంటే ఐరన్, కాల్షియం చాలా అవసరం. హిమోగ్లోబిన్ ఉత్పత్తి కావడంలో ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు కాల్షియం అవసరం. చాలామందిలో ఐరన్, కాల్షియం తక్కువై అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. అందుకే వైద్య నిపుణులు ఈ రెండు సప్లిమెంట్లను ఇస్తుంటారు. అయితే ఈ రెండూ కలపి తీసుకోవచ్చా?
ఈ రెండు సంప్లిమెంట్స్ తీసుకోవచ్చు కానీ..రెండు డోస్ లు తీసుకునే విధానంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అసరం. పరిశోధన ప్రకారం.. కాల్షియంతో కలిపి తీసుకోవడం వల్ల ఐరన్ ఒంటికి పట్టడడానికి 40శాతం నుంచి 60శాతం వరకు తగ్గుతుంది. అందుకే కాల్షియం సప్లిమెంట్లను ఐరన్ సప్లిమెంట్లతో తీసుకోవడం కానీ, అదే సమయంలో కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం కానీ మంచిది కాదు.
భోజనానికి ముందు ఐరన్ సప్లిమెంట్స్
ఐరన్ ఖాళీ కడుపుతో తీసుకుంటే బాగా ఒంటికి పడుతుంది. అంటే భోజనానికి ముందు తీసుకోవచ్చు. ఐరన్ సప్లిమెంట్స్ మీ జీర్ణాశయ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. ఇలాంటి సమయంలో ఏదైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించండి.
రెండూ ఒకేసారి ఎందుకు వద్దంటే…
ఐరన్, కాల్షియం ఒకదానికొకటి ప్రత్యేకమైన ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అందుకే వాటిని కలిపి ఒకేసారి తీసుకోవడం మంచిది కాదంటారు నిపుణులు. విటమిన్లు, మినరల్స్ కరిగిపోవడానికి కొంచెం సమయం పడుతుంది. రెండు కలిపి తీసుకోవడం వల్ల వాటిలో అందాల్సినవి శరీరానికి అందవు. ఈ రెండు సప్లిమెంట్లను ఆరు గంటల తేడాతో తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఐరన్ సంప్లిమెంట్స్ తీసుకునే సమయంలో…. పాలు, చీజ్, పెరుగు, బచ్చలికూర, టీ, కాఫీ, తృణధాన్యాలు తీసుకుంటే… రెండింటికీ మధ్య కనీసం రెండు గంటలు గ్యాప్ ఉండేలా ప్లాన్ చేసుకోండి. మీరు ఐరన్ సప్లిమెంట్లను తీసుకున్న తర్వాత కొన్ని గంటల పాటు యాంటాసిడ్లను కూడా నివారించాలి. వైద్యులు సూచించిన దానికన్నా ఎక్కువ కాలం ఐరన్ సప్లిమెంట్లను తీసుకోవద్దు.