స్వాతంత్ర్య భారత చరిత్రలో అత్యంత ప్రజాదరణ ఉన్న పార్టీ బీజేపీ. ప్రపంచంలోనే అత్యంత పాపులర్ లీడర్ ప్రధాని నరేంద్ర మోదీ. మోదీ 3.0కు భారత్ దేశం సిద్ధమవుతోంది. అంటే బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయన్నది చర్చనీయాంశమవుతుంది. బీజేపీ నేతృత్వ ఎన్డీయేకు 400 స్థానాలు దాటతాయా అన్నది మరో ప్రశ్న. ఎప్పటికప్పుడు నిర్వహించే సర్వేలు అధికార, విపక్షాల బలాబలాలను బేరీజు వేస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా అదే జరిగింది..
మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే…
ఇండియా టుడే గ్రూపు సంస్థ జనవరిలో ఒక సర్వే నిర్వహించింది. దానికి మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అని పేరు పెట్టింది. తాజా సర్వే ప్రకారం ప్రధాని మోదీ పాపులారిటీ పెరగడమే కానీ, తగ్గడం లేదని తేలిపోయింది. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన 272 సీట్లను ఎవరు సాధిస్తారన్న ప్రశ్న తలెత్తగా ఎన్డీయేకు 335 స్థానాలు ఖాయమని ఇండియా టుడే సర్వే తేల్చింది. పార్టీల పరంగా సీట్ల సంఖ్యను బట్టి చూస్తే బీజేపీకి 304 స్థానాలు వస్తాయని తెలింది. ఇంత హడావుడి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి కేవలం 71 స్థానాలు వస్తాయి. కాంగ్రెస్ నేతృత్వ ఇండియా గ్రూపు 166 చోట్ల మాత్రమే గెలుస్తుంది.
హిందీ రాష్ట్రాల్లో చెక్కుచెదరని బలం
ఉత్తరాదిన ముఖ్యంగా హిందీ రాష్ట్రాల్లో పార్టీ బలం ఏ మాత్రం తగ్గలేదని ఇండియా టుడే సర్వే చెబుతోంది. 80 స్థానాలున్న అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్లో పార్టీకి 70 సీట్లు ఖాయమని తెలిపోయింది. ఇది గత ఎన్నికల కంటే ఎనిమిది స్థానాలు ఎక్కువని చెప్పక తప్పదు. ఇతర ఉత్తరాది రాష్ట్రాల పరిస్తితి కూడా అలాగే ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్లో పార్టీకి క్లీన్ స్వీప్ ఖాయమని సర్వేలు నిగ్గు తేల్చాయి. ఇక దక్షిణాదికి వస్తే పాత బలం కాస్త అటు ఇటుగా ఉంటుంది. టీడీపీతో పొత్తు ఖరారవుతుందని భావిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ ఒక సీటు కూడా గెలివలేదు..
400 సీట్లు ఎలా…
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వచ్చే సీట్లను మాత్రమే ఇండియా టుడే గ్రూపు అంచనా వేసింది. అయితే ఎన్నికలు నిర్వహించడానికి ఇంకా 70 రోజుల వరకు టైమ్ ఉంది. ఈ లోపు ఇండియా గ్రూపులో లుకలుకలు తారా స్థాయికి చేరాయి. నితీశ్ కుమార్ వెళ్లి ఎన్డీయేలో చేరారు. చంద్రబాబు నాయుడును ఎన్డీయే ఆహ్వానించింది.అమిత్ షా స్వయంగా పిలిపించి మాట్లాడారు. త్వరలోనే ఆ లాంఛనం కూడా పూర్తవుతుంది. అంటే ఏపీలోని 25 లోక్ సభా స్థానాల్లో 17 నుంచి 20 వరకు ఎన్డీయే ఖాతాలో జమ కావడం ఖాయమని చెప్పాల్సిందే. పైగా ఇండియా గ్రూపు పార్టీల మధ్య కీచులాట కారణంగా ఓటరు మనోగతం మారి, ఓటింగ్ సరళిలో గణనీయమైన మార్పు వస్తుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ …. పార్లమెంటులో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం.. దేశ ఆర్థిక పరిస్థితి పదేళ్లలో ఎలా వృద్ధి చెందిందో వివరించింది. వాటన్నింటినీ చూస్తే ఎన్డీయేకు 400 స్థానాలు రావడం కష్టమేమీ కాకపోవచ్చు….