స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ ని మెగా హీరోలు రౌండప్ చేసేశారా? ఇప్పట్లో అక్కడి నుంచి బయటపడే ఛాన్సే లేదా? అంటే పరిస్థితి చూస్తుంటే అలానే ఉంది మరి. బన్నీతో ప్రాజెక్ట్ ఇంకా థియేటర్లలో సందడి చేయకముందే లైన్లోకి వచ్చేశాడు చెర్రీ…మధ్యలో మెగాస్టార్ తో మూవీ ఉంటుందనే టాక్ వచ్చింది..
బన్నీ తర్వాత చెర్రీ!
ఆర్య మూవీతో ఆరంభం అదుర్స్ అనిపించుకున్న సుకుమార్ బన్నీతో మళ్లీ ఆర్య 2 తరెక్కించాడు. ఆర్య – ఆర్య 2 మధ్యలో జగడం తీశాడు. ఆ తర్వాత 100% లవ్ , నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో మూవీస్ లో తన రేంజ్ పెంచుకున్నాడు. ఇక 2018 లో వచ్చిన రంగస్థలం మూవీతో సుకుమార్ క్రేజ్ మాత్రమే కాదు కొత్త రామ్ చరణ్ ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఆ తర్వాత పుష్ప ప్రాజెక్టులోకి ఎంటరయ్యాడు. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ విడుదలై ఎలాంటి సన్షేషన్ క్రియేట్ చేసిందో చూశాం..ఇప్పుడు అందరి కాన్సన్ ట్రేషన్ పుష్ప 2 పైనే. వాట్ నెక్స్ట్ అంటే రామ్ చరణ్ మళ్లీ లైన్లో ఉన్నాడంటున్నాడు లెక్కల మాస్టారు. ఇటీవలే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 17వ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నట్లు రివీల్ చేశారు. అల్లు అర్జున్ తో ‘పుష్ప-2’ హడావుడి ముగిసిన వెంటనే చెర్రీతో ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.
2030 వరకూ మెగా క్యాంప్ లోనేనా?
‘పుష్ప-2’ ఈ ఏడాది రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత కొన్నాళ్లు బ్రేక్ తీసుకుని…బుచ్చిబాబుతో చరణ్ మూవీ కంప్లీట్ అయిన వెంటనే రంగంలోకి దిగనున్నాడు. ఈ లోగా RC 17 మూవీకి మెరుగులు దిద్దుకుంటాడన్నమాట. ఈ లెక్కన చరణ్ – సుకుమార్ మూవీ 2026-27 లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక పుష్ప -2 తర్వాత పుష్ప-3 కూడా ఉంటుందనే ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే 2030 వరకూ అదే మూవీతో బిజీగా ఉండే ఛాన్సుంది. మెగాస్టార్ తో కూడా ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాడనే టాక్ ఉంది..దీనిపై అఫీషియల్ ప్రకటన అయితే ఇప్పటివరకూ లేదు.
విజయ్ ని పక్కనపెట్టేసినట్టేనా!
వాస్తవానికి పుష్ప 2 తర్వాత విజయ్ దేవరకొండతో సుకుమార్ మూవీ ఉంటుందనే ప్రచారం జరిగింది. అది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అన్నారు కూడా. కానీ ప్రస్తుతం ఉన్న లెక్కల్లో అది పట్టాలెక్కే అవకాశం కనిపించడం లేదు. విజయ్ కూడా ఫ్యామిలీ స్టార్ తో వస్తున్నాడు.. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరి మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ లెక్కన రౌడీ బాయ్ – సుకుమార్ కాంబోలో మూవీ ఇప్పట్లో లేనట్టే. మెగా క్యాంప్ హీరోలతో మూవీస్ పూర్తిచేస్తే కానీ సుకుమార్ మరో హీరోవైపు చూసే అవకాశమే కనిపించడం లేదు…