తెలంగాణ ప్రభుత్వానికి నిరుద్యోగుల నిరసన సెగ తగులుతోంది. అశోక్ నగర్లో గ్రూప్ వన్ వాయిదా పడటంతో ఓ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంది. దీంతో నిరుద్యోగులంతా ప్రభుత్వంపై రగిలిపోతున్నారు. నియామకాల పేరుతో యువతను ఉద్యమంలోకి లాక్కొచ్చి కొన్ని వందల మంది ప్రాణత్యాగం చేసేలా చేసిన కేసీఆర్… చివరికి ఆయన కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు ఇప్పించుకున్నారు. కానీ యువతకు మాత్రం మొండి చేయి చూపారు. అదే సమయంలో మోదీ సర్కార్ మిషన్ మోడ్లో ఆరేడు నెలల్లోనే పది లక్షల ఉద్యోగాలు ఇచ్చింది.
నిరద్యోగులకు టోకరా ఇచ్చిన కేసీఆర్
తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా కేసీఆర్ ఇవ్వలేదు. ఈసారి బీఆర్ఎస్ను కలవరపరుస్తున్న అంశం నిరుద్యోగమే. నిరుడు 80 వేల ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం ప్రకటించింది. కానీ పేపర్ లీకేజీ ఘటనలు, గ్రూప్ పరీక్షల వరుస వాయిదాలు, క్యాలెండర్ ప్రణాళికలో లోపం.. ఇలా వరుస వివాదాలతో భర్తీ ప్రక్రియ ముందుకు సాగలేదు. తమ జీవితంలో పదేళ్లు వృధా చేసుకున్న యువత నలిగిపోతున్నారు. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 34 శాతంగా ఉంది. దాదాపు 34 లక్షల మంది వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీళ్లలో పట్టుమని పది మందికి ఉద్యోగాలివ్వలేదు.
నిరుద్యోగ భృతి పేురతో మరో మోసం
నిరుద్యోగులకు నెలకు రూ.3016 భృతి అందిస్తామని మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.1810 కోట్లను కేటాయించింది. ఆ తర్వాత హామీ విషయాన్ని ప్రభుత్వం పూర్తిగా పక్కన పడేసింది. భుత్వం ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఇస్తే మా కోచింగ్కు ఎంతో సాయపడేది. కానీ కేసీఆర్ మోసం చేశారు. నిరుద్యోగ భృతి విషయంలో బీఆర్ఎస్ పార్టీ నాలుగున్నరేళ్లలో ఏ విధమైన ప్రణాళిక చేయలేదు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కేటాయించిన నిధులు ఏమయ్యాయో ప్రభుత్వం చెప్పలేదు. ఒకవైపు నోటిఫికేషన్ల విషయంలో గందరగోళంతో ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు ఇచ్చిన హామీ నెరవేర్చే విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు.. ఫలితంగా నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
ఏడాదిలో పది లక్షల ఉద్యోగాలిచ్చిన మోదీ సర్కార్
ఏడాది కాలంలో 10 లక్షల మందిని మిషన్ మోడ్లో నియమించాలని వివిధ ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖలను గత ఏడాది జూన్లో మోదీ ఆదేశించారు. అన్నట్లుగానే 10 లక్షల మందిని రిక్రూట్ చేసుకున్నారు. ఇందు కోసం ‘రోజ్గార్ మేళా’ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మోదీ వర్చువల్గా అందరికీ నియామక పత్రాలు అందించారు. , కేంద్ర సాయుధ దళ సిబ్బంది, సబ్ ఇన్ స్పెక్టర్, కానిస్టేబుల్, ఎల్డీసీ, స్టెనో, పీఏ, ఇన్ కమ్ టాక్స్ ఇన్ స్పెక్టర్లు, ఎంటీఎస్, తదితర పోస్టులు భాగంగా ఉన్నాయి. ఈ నియామకాలను మంత్రిత్వ శాఖలు, విభాగాలు అయితే స్వతహాగా లేదా యూపీఎససీ, ఎస్ఎస్సీ , రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు వంటి నియామక సంస్థల ద్వారా లేదా మిషన్ మోడ్లో చేపట్టారు . తెలంగాణలో యువతకు కూడా పెద్ద ఎత్తున అవకాశాలు వచ్చాయి.
కేసీఆర్ కూడా ఇలాగే ఉద్యోగాల భర్తీ చేపడతారని అనుకున్నారు కానీ… నిరుద్యోగులు మోసం చేశారు. బీజేపీ వస్తే మళ్లీ మిషన్ మోడ్ లో ఉద్యోగాల భర్తీ ఉంటుందని ఆశిస్తున్నారు.