మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేశారని.. దీనికి దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావే కారణం అంటూ .. బీఆర్ఎస్ నేతలు చేసిన హడావుడి చివరికి వారి పరువుపోయేలా చేసింది. సంచలనం కోసమే… నిందితుడు కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేశారని సీపీ శ్వేత ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ నేతలు చేసిన డ్రామాలన్నీ కామెడీ అయిపోయాయి. ముఖ్యంగా హరీష్ రావు వేసిన వేషాలు చూసి సొంత పార్టీ నేతలు కూడా నవ్వుకుంటున్నారు.
కత్తిదాడిని బీజేపీపైకి నెట్టాలనుకున్న బీఆర్ఎస్
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తిదాడి వ్యవహారాన్ని వాడుకుని రాజకీయంగా ప్రయోజనం పొందాలనుకున్న బీఆర్ఎస్ పెద్దల ప్రయత్నం నవ్వుల పాలయింది. పోలీసుల ప్రాథమిక విచారణ సందర్భంగా ఎంపీపై దాడిచేసిన వ్యక్తి కేవలం సంచలనం సృష్టించడానికే ఈ చర్యకు పాల్పడ్డట్టు సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత మీడియాకు చెప్పడంతో అసలు సంగతి బయటకొచ్చింది. మూడోసారి అధికారంలోకి రావాలనే తపనతో బీఆర్ఎస్ నాయకత్వం తప్పులో కాలేసింది. అభాసుపాలైంది. దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై తప్పుడు ప్రచారం చేస్తూ… నియోజకవర్గంలో ప్రత్యేకంగా స్క్రీన్లు పెట్టి ప్రదర్శనలు కూడా చేశారు. చివరికి నిజం తేలింది.
హరీష్ రావు హడావుడి అభాసుపాలు
కత్తి దాడి ఘటనపై రాజకీయ ప్రయోజనాలను ఆశించి సభలు, సమావేశాలు, ట్వీట్ల ద్వారా స్టేట్మెంట్లు ఇచ్చారు. సోషల్‌మీడియాలోనూ భారీగా పోస్టులు పెట్టారు. రాజకీయ పార్టీలను సైతం తప్పుబట్టారు. చికిత్స సందర్భంగా ఆస్పత్రిలోనూ హడావిడి చేశారు. ఈ ఘటనను ఎన్నికల్లో లబ్ధికోసం ఉపయోగించుకునే ప్రయత్నాన్ని హరీష్ రావు వైపు నుంచి గట్టిగానే జరిగింది. చివరికి కేసీఆర్ కూడా… ఇది బీజేపీ పనేనని వదిలేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. అత్యంత గడ్డు పరిస్థితుల్లో ఉన్న బీఆర్ఎస్ కు… ఏది దొరికినా పండగేనన్నట్లుగా వ్యవహరిస్తోంది. పరువు పోగొట్టుకుంది.
దళిత బంధు ఇవ్వలేదనే అసలు కోపం ?
నిందితుడు రాజు దళితుడు. అతనికి దళిత బంధు ఇవ్వలేదు. గ్రామంలో ఒకరిద్దరికి ఇచ్చి మిగతా వారికి ఇవ్వకపోవడంతో దళితులంతా బీఆర్ఎస్ సర్కార్ పై ఆగ్రహంతో ఉన్నారు. చివరికి ్దే కత్తి దాడికి దారి తీసింది. అంటే ప్రభుత్వంపై ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో స్పష్టమవుతోంది. ఈ వియంలో బీజేపీని బ్లేమ్ చేయడానికి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో బీఆర్ఎస్ నేతలు తేలుకుట్టిన దొంగల్లా మారిపోయారు. పథకం పారదని తెలీడంతో ఎప్పుడైనా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి మళ్లీ ప్రచారానికి వెళ్లేందుకు కొత్త ప్రభాకర్ రెడ్డి రెడీ అవుతున్నారు.