కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తరచూ తన అవివేకాన్ని ప్రదర్శిస్తుంటారు. దానితో ఆయన ఒక మాట అంటే బీజేపీ నేతలు పది మాటలతో సమాధానమిస్తారు. ఐనా రాహుల్ తీరు మారదు. ఎక్కడోక్కడ తప్పులో కాలేస్తూ,విషయ పరిజ్ఞానం లేకుండా పప్పు టైప్ స్పీచులు ఇచ్చేస్తుంటారు. దానితో ఇక బీజేపీ సోషల్ మీడియా సైన్యం రెచ్చిపోతుంది. వాటికి కమలం పార్టీ నేతల ప్రకటనలు తోడవుతుంటాయి..
అమెరికాలో మోదీపై సెటైర్లు
విదేశీయుల ముందు మన దేశాన్ని, మన నేతలను పలుచన చేసే పనులకు దిగకూడదని రాహుల్ గాంధీకి తెలియనిది కాదు. ఐనా సరే తన అవివేకాన్ని ప్రదర్శిస్తూ ప్రతీ సారి దేశ ప్రతిష్టను దిగజార్చే మాటలు మాట్లాడుతుంటారు. విదేశీయుల ఎదుట ప్రధాని మోదీని కింపరుస్తుంటారు. రాహుల్ కాలిఫోర్నియా వెళ్లారు. అక్కడ శాంటా క్లారాలో భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించారు. బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ప్రధాని మోదీని ఎగతాళి చేసేందుకు ప్రయత్నించారు. దేవుడు, మోదీ పక్కపక్కన కూర్చుంటే దేవుడికే మోదీ పాఠాలు చెబుతారని వెక్కిరించారు. మోదీ మాటలతో దేవుడే అయోమయానికి లోనవుతారని ఎద్దేవా చేశారు. పైగా దాన్నోక రోగంగానో, వైకల్యంగానో అభివర్ణించేందుకు రాహుల్ ప్రయత్నించారు.
అతనో ఫేక్ గాంధీ..
ఇష్టానుసారం మాట్లాడుతున్న రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు ఓ రేంజ్ తో విరుచుకుపడ్డారు. దేశాన్ని దేశ ప్రజలను కించపరుస్తున్నారన్నారు. ఆయనో ఫేక్ గాంధీ అంటూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి ప్రహ్లాద్ జోషి కౌంటర్ సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీకున్న చరిత్ర పరిజ్ఞానం ఆయన కుటుంబాన్ని దాటి పోదని తేల్చేశారు. బంగాళాదుంపల నుంచి బంగారం వస్తుందనుకునే నాయకుడు రాహుల్ గాంధీ అని ప్రహ్లాద్ జోషీ చెప్పుకొచ్చారు. మరో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా రాహుల్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారత్ ను రాహుల్ ఒక జాతిగా కూడా పరిగణించరని ఠాకూర్ గుర్తు చేశారు. దేశంపై బురదజల్లేందుకే రాహుల్ టూర్లు వేస్తారని ఆయన అన్నారు. రాహుల్ కు ఏమీ తెలియకపోయినా అన్ని తెలిసినట్లు మాట్లాడుతుంటారని మాజీ మంత్రి ముక్తర్ అబ్బాస్ నక్వీ ఆరోపించారు. ప్రపంచం మొత్తం మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తుంటే.. రాహుల్ లాంటి వాళ్లు భరించలేకపోతున్నారని ఆయన అన్నారు.
మీ అజ్ఞానాన్ని ఎన్ని రోజులు భరించాలి బాబూ..
రాహుల్ తనకు తెలియని విషయాలపై మాట్లాడుతూ మరో వివాదంలో కూడా చిక్కుకున్నారు. గురునానక్ థాయ్ ల్యాండ్ వెళ్లి సిక్కు తమ ప్రచారం చేశారని అమెరికా పర్యటనలో రాహుల్ అన్నారు. దానితో సిక్కులంతా ఇప్పుడు రాహుల్ అజ్ఞానంపై మండిపడుతున్నారు. ఇలాంటి వార్తలు రాహుల్ కు ఎవరు అందిస్తున్నారో అర్థం కావడం లేదని సిక్కు నేత మంజిందర్ సింగ్ సిర్సా ప్రశ్నించారు. మత విశ్వాసాల విషయంలో పూర్తి సమాచారం తెప్పించుకుని మాట్లాడాలని సూచించారు. రాహుల్ ను బుద్ధి జీవిగా చూడాలనుకోవడం తమ అవివేకమవుతుందని కూడా ఆయన ఆగ్రహం చెందారు..