రాష్ట్ర వ్యాప్త ప్రజాచార్జిషీట్‌ – 19న గన్నవరంలో ఏపీ బీజేపీ కీలక సమావేశం !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగేళ్ల కాలంలో ఎంత ఘోరమైన పరిపాలనా పరమైన తప్పులు, అవినీతికి పాల్పడిందో బీజేపీ నేతలు చేపట్టిన ప్రజా చార్జిషీట్ ఉద్యమాల్లో వెల్లడవుతోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వైసిపి ప్రభుత్వం, అవినీతి, అక్రమాలపై అభియోగాల సేకరణపై దాదాపుగా ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ పర్యటిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తున్నారు. వారి చార్జిషీట్ లను అందుకుని సంబంధిత అధికారులకు అందిస్తున్నారు. ఈ క్రమంలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

కేంద్ర నిధుల దారి మళ్లింపు !

సాగరమాల పథకం కింద జాతీయ రహదారులను రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రం నిర్మిస్తోంది. వెనుకబడిన పల్నాడు వంటి ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం దండిగా నిధులు కేటాయించినా.. వాటిని ప్రభుత్వం దారి మళ్లించిందని సోము వీర్రాజు మండి పడుతున్నారు. పలనాడు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మొండి చేయి చూపుతుందని చార్జిషీటు లో స్పష్టం చేశారు జల్ జీవన్ మిషన్ ద్వారా నిధులు అందించి ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లు నిర్మించాలని కేంద్రం భావిస్తే ఆ నిధులను కూడా పక్కదారి పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు ప్రాంతంలో అనేకమంది భూములు కబ్జాకి గురి అయినట్లు తన దృష్టికి వచ్చాయన్నారు.దీనిపై ఆర్డిఓ గారికి సమస్యలను నివేదిస్తూ ఈరోజే అర్జీలు దాఖలు చేశామని.. అధికారులు సానుకూలంగా వ్యవహరించి భూములు కోల్పోయిన పేదలకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామని ప్రకటించారు.

ఎక్కడ చూసినా భూకబ్జాలు – దందాలే

రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీలో నియోజకవర్గం లలో ఈ భూకబ్జాలు సహజ వనరుల దోపిడీ అరాచకంగా సాగుతున్నయని సోము వీర్రాజు స్పష్టం చేశారు. లక్షల సంఖ్యలో ప్రజలు బీజేపీకి చార్జిషీట్ల రూపంలో తమ బాధలు తెలియచేశారన్నారు. ప్రభుత్వం మరియు స్థానిక నాయకుల తీరుపై ప్రజల నుండి అనేక అభియోగాలు వచ్చాయన్నారు. ఇకనైనా మారాలి అవినీతితో సంపాదించిన డబ్బు ఆర్భాటాలకు ఖర్చు చేసి అధికారం దిశగా చేస్తున్న ఈ దుర్మార్గ పాలనను ప్రజలు తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారు అని అన్నారు. దళిత కుటుంబాలకు సంబంధించిన మూడు ఎకరాల భూమి ఏళ్ల తరబడి సాగులో ఉన్నప్పటికీ తాజాగా వైసీపీ పాలనలో సాగు చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయి కబ్జాలకు గురయ్యే దిశగా పాలన సాగుతుంది ఆని తెలిపారు.

గాడి తప్పిన గ్రామ సుపరిపాలన

గ్రామపంచాయతీలను నిర్వీర్యం చేశారు కరెంటు బిల్లుల పేరుతో గ్రామపంచాయతీ నిధులను కూడా దొబ్బేసారు. గ్రామపంచాయతీ సర్పంచులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి గ్రామాలు అభివృద్ధి చెందకుండా గ్రామ సర్పంచులకు ఆర్థిక స్వావలంబన లేకుండా గ్రామాల అభివృద్ధి కుంటుపడే విధంగా కుటిల సాకులతో దుర్మార్గాలకు పాల్పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం నుండి అన్ని మంత్రిత్వ శాఖల నుండి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చురుకుగా నిర్వహిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాట్లు కూడా ఇవ్వ లేని స్థితిలో నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఉందన్న విషయం వెల్లడయింది. వీటన్నింటినీ ప్రజల ముందు పెట్టేందుకు సిద్ధమయ్ారు.

అభివృద్ధికి సహకరించని రాష్ట్ర ప్రభుత్వం

ప్రతి జిల్లాలో 1200 కోట్లకు పైబడి నిధులు ఉపయోగించి జల్ జీవన్ మిషన్ పనులు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్.ఎం.పి డాక్టర్లకు గుర్తింపు లేకుండా పోయింది. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం లో కూడా వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించే కార్యక్రమాలను చేపట్టారు. ప్రస్తుతం ఆ కార్యక్రమాలు లపై రాష్ట్ర ప్రభుత్వం ఆశక్తి చూపించడం లేదన్నారు.రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన చార్జిషీట్లు కార్యక్రమానికి సంబంధించి ఈ నెల 19వ తేదీన గన్నవరంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కార్యక్రమంలో నిర్ణయం తీసుకుంటామని సోము వీర్రాజు తెలిపారు.