భక్తి – ఆధ్యాత్మిక రెండూ ఒక్కటి కాదా , ఏంటి వ్యత్యాసం!

భక్తి, ఆధ్యాత్మికం అంటే రెండు ఒకటే అనుకుంటారు కానీ రెండింటి మధ్యా చాలా వ్యత్యాసం ఉందని చెబుతారు ఆధ్యాత్మిక పండితులు.

భక్తి
భగవంతుడిని మనసా, వాచా స్మరిస్తూ మనల్ని మనం ఆయనకు అర్పించుకోవడమే భక్తి. ఏమీ ఆశించకుండా, కేవలం ఆ భగవంతుడిని స్మరించడమే భక్తి . రాముడిపై ఆంజనేయస్వామికి ఉండేది భక్తి అంటారు.పరమేశ్వరుడిపై నందీశ్వరునికి ఉండేది భక్తి. భగవత్ తత్వం తెలుసుకున్న వారికి భక్తి గుండెల లోతుల నుంచి వస్తుంది. భక్తి అంటే శ్రద్ధ, దేవునిపై లేదా మనం నమ్మిన గురువులపై అచంచల విశ్వాసం, నమ్మకం ఉండాలి.

ఆధ్యాత్మికత
ఆధ్యాత్మికత అంటే పూర్తిగా జ్ఞానానికి చెందినది. మహోన్నతం, అనంతం, అంతిమం అయిన స్వేచ్ఛ వైపు చేసే ప్రయాణమే ఆధ్యాత్మికత.
భగవంతునికి భజన చేసుకున్నా, స్మరించుకున్నా భక్తికి సరి పోతుంది కానీ దాంతోనే పూర్తిగా జ్ఞానం వచ్చేస్తుందని చెప్పడానికి వీలు లేదు.
ఆధ్యాత్మికత అంటే గ్రంథాలు, ఉపషనిత్తులు, వేదాలు చదవడం వల్ల జ్ఞానం వస్తుంది లేదంటే అవి చదివిన వారు బోధిస్తుంటే వాటిని వినడం వల్ల కూడా జ్ఞానం సిద్ధిస్తుంది.

ఆత్మజ్ఞానమే ఆధ్యాత్మికతకు మార్గం
నేను ఎవరు అనే ప్రశ్నకు అసలైన సమాధానం తెలుసుకోవడమే ఆత్మ జ్ఞానం అంటారు.ఆత్మ జ్ఞానమే ఆధ్యాత్మికతకు అంతిమ లక్ష్యం.దానికి ఆధ్యాత్మికత దారిలో జ్ఞానం పొందడమే అత్యంత అవసరం. పూజలు, వ్రతాలతో ఆత్మ జ్ఞానాన్ని పొందలేము. భక్తితో చిత్త శుద్ధి ఏర్పడుతుంది. చిత్త శుద్ధి ఉంటే చెడు ఆలోచనలకు అవకాశం ఉంది.

ఆధ్యాత్మిక జీవితం ఆరోగ్యం
ఆధ్యాత్మిక జీవితం గడపడం ద్వారా అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ధ్యానం, ప్రార్థన, యోగా, శ్రద్ధ, భక్తి మొదలైన పద్దతులు ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడానికి మార్గాలు. వీటిలో ఏ మార్గాన్ని ఎంచుకొని నడిచినా, అది వారి వికాసానికి, వారి శ్రేయస్సుకు దోహదపడుతుంది.

గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.