అతిలోక సుందరి శ్రీదేవి ఆస్తులన్నీ అమ్మేస్తున్నారా..నిజమేనా!

బాలీవుడ్ లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. బోనీకపూర్ అండ్ డాటర్స్ కలసి శ్రీదేవి ఆస్తులన్నీ అమ్మేస్తున్నారని. ఈ వార్తలో నిజమెంత? అదే నిజమైతే అసలు శ్రీదేవి ఆస్తులను వాళ్లెందుకు అమ్మేస్తున్నారు? దీని వెనకున్న అసలు విషయం ఏంటి?

అతిలోక సుందరి శ్రీదేవి మన మధ్య లేకపోయినప్పటికీ ఇప్పటికీ అభిమానులకు ఆమె ఆరాధ్య దేవతే. శ్రీదేవి భర్త బోనీకపూర్, కూతుళ్లు జాన్వీకపూర్‌, ఖుషీ ఎప్పటికప్పుడు ఆమెతో తమ అనుబంధాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. జాన్వికి ఇప్పటివరకూ చెప్పుకోదగిన హిట్స్ లేకపోయినా అదిరిపోయే ఫాలోయింగ్ ఉందంటే శ్రీదేవి డాటర్ కావడమే మెయిన్ రీజన్. ఇప్పడు శ్రీదేవి ఫ్యామిలీకి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వార్త అందరికీ షాకిస్తోంది. బోనీకపూర్ తన పేరు మీద, తన కూతుర్లు జాన్వీ , ఖుషి పేర్ల మీద ఉన్న ఉమ్మడి ఆస్తులను రీసెంట్ గా అమ్మేసినట్టుగా ఒక వార్త బీటౌన్‌లో హల్‌చల్ చేస్తోంది. అసలు శ్రీదేవి కుటుంబానికి ఆస్తులు అమ్మేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్నది హాట్ డిస్కషన్ నడుస్తోంది.

పిల్లలతో సంప్రదించిన తర్వాతే
శ్రీదేవి తాను సంపాదించిన ఆస్తులు మొత్తం భర్త బోనీ పేరు మీద రాసింది. ఇప్పుడా ఆస్తులన్నీ అమ్మేస్తున్నాడట బోనీ. తాజా టాక్‌ ప్రకారం శ్రీదేవి, బోనీపూర్ పేరు మీదున్న బంగ్లాను 12 కోట్లకు అమ్మేసారట. ఈ డబ్బుతో మరో భారీ ప్రాపర్టీలో పెట్టుబడులు పెట్టాలని ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 100 కోట్లకు పైగా బోనీ కపూర్ అమ్మేసినట్టు టాక్. బాంద్రాలోని డూప్లెక్స్ అపార్ట్మెంట్, ముంబై లోని అంధేరీ శివారులో ఉన్న నాలుగు అంతస్తుల అపార్ట్మెంట్ , అక్కడే ఉన్న రెండు ఫ్లాట్లు, లోఖండ్ వాలా లోని రెండు అపార్ట్మెంట్లను వరుసగా అమ్ముకుంటూ వస్తున్నారట బోనికపూర్. తన ఇద్దరు కూతుర్లతో కలిసే బోనీ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

బోనీకి డబ్బు కొదవా!
బోనీ కపూర్ పెద్ద నిర్మాత ఆయన దగ్గర డబ్బుకు కొదవ లేదు. జాన్వీ కపూర్ కూడా ఒక్కో సినిమాకి 5 కోట్ల రూపాయిల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. వరుస ఆఫర్లు కూడా ఉన్నాయి. ఇక కుటుంబ పరంగా ఉన్న వ్యాపారాలు, పెట్టుబడుల నుంచి ప్రతీ నెల కోట్ల రూపాయలు వస్తూనే ఉంటాయి. అయినప్పటికీ శ్రీదేవి జ్ఞాపకాలుగా ఉన్న ఆస్తులను ఎందుకు అమ్మాల్సి వచ్చిందో ఎవరికీ అర్థం కావడం లేదు. పెద్దగా ఉపయోగం లేకుండా పడి ఉండడం ఎందుకనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. త్వరలోనే ముంబైలో ఓ లగ్జరీ అపార్ట్మెంట్ తీసుకొనే ఆలోచనలో ఉన్నట్లు టాక్.
శ్రీదేవి గుర్తుగా మిగిలిన ఆస్తులను అమ్మేయడాన్ని జీర్ఙించుకోలేకపోతున్నారు ఫ్యాన్స్‌.