హోలీకి రంగులు చల్లుకోండి కానీ ఇవి గుర్తుంచుకోండి!

హోలీ వచ్చిందంటే చాలు పిల్లలకు పెద్దలకు పండగే. చిన్నా పెద్దా అందరూ రంగులు చల్లుకుని సంతోషిస్తారు. అయితే ఏ రంగులు చల్లుకోవాలి? ప్రస్తుతం మార్కట్లో ఉన్న రంగులు వినియోగిస్తే ఏమవుతుంది?

అన్నీ కృత్రిమ రంగులే
హోలీ అనగానే ప్రకాశవంతమైన రంగులే గుర్తొస్తాయి. అయితే ఆ రంగులన్నీ కృత్రిమ రంగులనే విషయం గుర్తుపెట్టుకోండి. వాటిని జాగ్రత్తగా ఉపయోగించకపోతే ప్రమాదకరమైన రసాయనాలు మీపై దాడిచేస్తాయి. ఇది మీ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది.

చర్మ సంబంధిత సమస్యలు
కొందరికి ఎలర్జీలు త్వరగా వస్తాయి. చర్మం సున్నితంగా ఉండేవారు రసాయనాలు కలిపిన హోలీ రంగులను చల్లుకోవడం వల్ల చర్మ సంబంధ వ్యాధులు ఎప్పటికీ వదలవు. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. రసాయనాలు కలిసిన రంగుల్లో భారీ లోహాలు, సింథటిక్ సంకలనాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చర్మంపై దద్దుర్లు, దురదను కలిగిస్తాయి.

కంటికి సంబంధించిన సమస్యలు
ఈ రంగులు కళ్ళల్లో పడితే అంతే సంగతులు. కొందరిలో కంటి సమస్యలు ఎక్కువైపోతాయి. కెమికల్ తో నిండిన రంగులు కంట్లో పడి చికాకును కలిగిస్తాయి. ఎర్రగా మారుస్తాయి. కార్నియాను దెబ్బతీస్తాయి. కాబట్టి హోలీ రోజు కచ్చితంగా సన్ గ్లాసెస్ పెట్టుకోవడం మర్చిపోవద్దు. కళ్ళల్లో రంగులు పడకుండా జాగ్రత్త పడింది.

శ్వాస సంబంధిత సమస్యలు
ఈ రంగుల వల్ల శ్వాస సంబంధిత రోగాలు వచ్చే అవకాశం ఈ హోలీ రంగుల వల్ల ఉంది. ఈ రంగుల్లో ఉండే రసాయనాలను పీల్చడం వల్ల ఆస్తమా అలర్జీలు వస్తాయి. అంతర్లీనంగా ఉన్న శ్వాసకోశ సమస్యలు కూడా పెద్దవవుతాయి. ఈ సూక్ష్మ కణాలు ఊపిరితిత్తుల్లో చేరి తీవ్రంగా బాధపడతాయి

రసాయనాలు కలిపిన రంగులను వాడే కన్నా ప్రకృతి సిద్ధంగా తయారైన రంగులతోనే హోలీ ఆడుకోవడం మంచిది. వీలైనంతవరకు ప్రతి ఒక్కరూ సహజమైన రంగులు వాడేందుకు ప్రయత్నించండి. చర్మానికి ఆవాల నూనె లేదా పెట్రోలియం జెల్లీని బాగా పట్టించండి. పొడవాటి చేతులున్న దుస్తులు వేసుకోండి. చర్మంపై ఈ రసాయనాలు కలిపిన రంగులు పడకుండా జాగ్రత్త పడండి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.