జామకాయ తింటే ఇన్ని రోగాలు మాయమైపోతాయా!

అధిక ధర పెట్టిన కొనుగోలు చేసిన పండ్లు ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తాయని అందరూ భావిస్తారు. ఎంత ధరపెట్టి కొట్టే అంత మంచిది అనుకుంటారు. కానీ పోషకాల్లో జామపండుని మించినది లేదంటారు ఆరోగ్య నిపుణులు. తక్కువ ధరకు అందరకీ లభ్యమయ్యే జామపండు ఆరోగ్యానికి చాలా మంచిదని సూచిస్తున్నారు

నిండా పోషకాలే
ప‌ది ర‌కాల పళ్లు తినేకన్నా జామపండు ఒక్కటీ తింటే చాలంటారు ఆరోగ్య నిపుణులు. ఏడాది పొడవునా దొరికే జామపండుని రోజుకొకటి తింటే శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. పైగా మిగిలిన పళ్లతో పోలిస్తే తక్కువ ధరకే లభిస్తాయి. జామ‌చెట్ల‌ను పెంచ‌డానికి ఎక్కువ‌గా ఎరువులు, పురుగు మందులు వాడాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఇతర పళ్లలా పక్వానికి రాకముందే సేకరించి కార్బైడ్ పెట్టి మ‌గ్గించి అమ్ముతూ ఉంటారు. కానీ జామ‌కాయ‌ల‌ను ప‌క్వానికి రాక‌ముందే కోయ‌లేరు. ప‌క్వానికి రాని జామ‌కాయ‌ల‌ను అస్స‌లు తిన‌లేము. అంటే వీటిని కల్తీ చేయలేరు కాబట్టి రోజుకొకటి తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపతుడుందని చెబుతున్నారు నిపుణులు.

రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి
100 గ్రాముల జామ‌కాయ‌లో 45 నుంచి 50 క్యాల‌రీల శ‌క్తి, 200 మిల్లీ గ్రాముల విట‌మిన్ సి ఉంటుంది. మామిడికాయ‌, అర‌టిపండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు వెంట‌నే పెరుగుతాయి. కానీ జామ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. వీటిలో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండడం వల్ల జామ‌కాయ‌లు జీర్ణం కావడానికి స‌మ‌యం ప‌డుతుంది. దీంతో గ్లూకోజ్ ర‌క్తంలో నెమ్మ‌దిగా క‌లుస్తుంది కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు ఎలాంటి సందేహాలు లేకుండా తినొచ్చు. పైగా రోజుకో జామకాయ తినేవారికి భవిష్యత్ లో షుగర్ వ్యాధి రాకుండా ఉంటుందని కూడా నిపుణులు చెబుతున్నారు.

బరువు తగ్గేందుకు సహకరిస్తుంది
జామ‌కాయ‌లో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉన్నందున బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు కూడా వీటిని తీసుకోవ‌చ్చు. అలాగే జామ‌కాయ‌ల్లో కంటే జామ‌పండ్ల‌ల్లో పోష‌కాలు మ‌రింత ఎక్కువ‌గా ఉంటాయి. ఎప్పుడూ తీసుకున్నా కూడా జామ‌పండ్ల‌ను ఎక్కువ‌గా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని తింటే జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేరకుండా ఉంటాయి. జామ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుప‌డుతుంది. ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ మెరుగుప‌డుతుంది. క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధుల బారిన ప‌డ‌కుంటా ఉంటారు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.