బౌస్ శబ్ధం వింటే అనారోగ్యం పోవడం ఏంటి అని ఆశ్చర్యపోవచ్చు కానీ ఇది నిజం. ధ్యానం కోసం టిబెటన్లు ఈ సింగింగ్ బౌల్స్ ని ఉపయోగిస్తారు. దీన్నుంచి వచ్చే శబ్ధం కొన్ని అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతందని చెబుతారు..
ఒత్తిడి తగ్గించే సింగింగ్ బౌల్
టిబెటన్ సింగింగ్ బౌల్స్ ప్లే చేసే శబ్దాలను విన్నారా? ఈ శబ్దాలు ఒత్తిడిని తగ్గిస్తాయి, ప్రశాంతతను అందిస్తాయని చెబుతారు. టిబెటన్ సింగింగ్ బౌల్స్ సాధారణ రాగి, టిన్, జింక్, ఇనుము, వెండి, బంగారపు లోహాలతో తయారు చేస్తారు. ఈ బౌల్పై చెక్కతో రుద్దినపుడు చక్కని శబ్దాలు వస్తాయి. ఈ గిన్నెల నుంచి మాత్రమే వచ్చే ప్రత్యేకమైన ప్రకంపనల ద్వారా హీలింగ్ ఎనర్జీ విడుదలువుతుంది.
నిద్రలేమికి చికిత్స
ఈ వైబ్రేషన్లను వైద్య చికిత్సగా కూడా ఉపయోగిస్తారు. ధ్యానంలోకి వెళ్లడం ఏకాగ్రతతో కొనసాగించడం దీని వల్ల సాధ్యమవుతుంది. ముఖ్యంగా నిద్రలేమితో బాధపడేవారు సింగింగ్ బౌల్ శబ్దాలు వింటే కాసేపటికే ప్రశాంతమైన నిద్రలోకి జారుకుంటారు.
పర్యావరణ శుద్ధి కోసం సింగింగ్ బౌల్
టిబెటన్లు వారి ఆధ్యాత్మిక, ధ్యాన అభ్యాసాలలో మాత్రమే కాదు..ఈ బౌల్స్ నుంచి వచ్చే శబ్దాలు పర్యావరణాన్ని శుద్ధి చేస్తాయని నమ్ముతారట.
పెద్దగా శిక్షణ అవసరం లేదు
సింగింగ్ బౌల్పై శబ్దాలు చేయడానికి పెద్దగా శిక్షణ అవసరం లేదు. గిన్నెను మేలట్తో (చెక్కతో చేసిన వస్తువు) సున్నితంగా రుద్దడమే. ఈ శబ్దాలు ఒత్తిడిని తగ్గించడానికి, శరీరంలో ఒత్తిడికి సంబంధించిన వ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడతాయి.
అన్ లైన్లో ఉన్నాయి
ఈ బౌల్స్ కాస్త ఖరీదైనవే.. ఆన్ లైన్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని బుద్ధ బౌల్, హిమాలయన్ బౌల్, రిన్ గాంగ్, బౌల్ గాంగ్, కప్ గాంగ్ అని కూడా పిలుస్తారు.
అయితే కొన్ని నిర్ధిష్టమైన పరిస్థితుల్లో సింగింగ్ బౌల్స్ ని వినియోగించకూడదు అంటారు నిపుణులు. ఈ శబ్ధాలు విన్నప్పటికి – మామూలుగా ఉన్నదానికి మధ్య వ్యత్యాసం గుర్తించాలి. ముఖ్యంగా గర్భిణిలు వైద్యుల అనుమతి లేకుండా ఈ సింగింగ్ బౌల్ శబ్దాలు వినకూడదని చెబుతారు.