బ్లాక్ హెడ్స్ సమస్య చాలా మందికి ఉంటుంది. కొందరికి ముక్కుపై మాత్రమే ఉంటే మరికొందరిక ముఖం మొత్తం బ్లాక్ హెడ్స్ వేధిస్తాయి. ఎన్నిసార్లు క్లీన్ చేసినా మళ్లీ మళ్లీ ఇబ్బందిపెడుతూనే ఉంటాయి. అయితే వీటిని తొలగించుకునేందుకు అనవసరంగా ఖర్చు చేయొద్దు.. మీ ఇంట్లో ఉండే వస్తువులతోనే వాటిని తొలగించుకోవచ్చంటారు నిపుణులు.
బ్లాక్ హెడ్స్ ఎందుకొస్తాయి
బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ముక్కు, చంపలు, నుదురు భాగాల్లో వస్తూ ఉంటాయి. ఆయిల్ స్కిన్ ఉన్నవారికి ఈ సమస్య మరింత ఎక్కువ. ఫేస్ ని సరిగా శుభ్రం చేసుకోపోవడం, పొల్యూషన్ , జిడ్డు చర్మంపై పేరుకుపోయిన మురికి, ధుమ్ము ధూళి కారణంగా మృతకణాల సంఖ్య పెరగడం వల్ల ఈ బ్లాక్ హెడ్స్ ఏర్పడతాయి. వీటివల్ల ఎలాంటి హాని జరిగిపోదు కానీ ఫేస్ లుక్ పోతుంది. ఏదో చిరాగ్గా కనిపిస్తుంది. బ్లాక్ హెడ్స్ సమస్య నుంచి బయటపడేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్లో లభించే స్క్రబ్స్ , స్ట్రిప్స్, ఫేస్ వాష్ ఇలా రకరకాలుగా వినియోగిస్తారు . అయితే అవన్నీ పక్కపడేసి ఇంట్లో ఉండే వస్తువులతో సింపిల్ గా బ్లాక్ హెడ్స్ తొలగించేసుకోవచ్చు. ఖర్చు కూడా తక్కువ పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవు.
టూత్ పేస్ట్-ఉప్పు
ఒక గిన్నెలో కొద్దిగా ఉప్పు, టూత్ పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ముఖానికి వేడి నీటితో ఆవిరి పట్టాలి. ఆ తర్వాత ముందుగా తయారు చేసుకున్న టూత్ పేస్ట్ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ పై రాసి మర్దనా చేయాలి. దీనిని మరో 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే బ్లాక్ హెడ్స్ చాలా సులభంగా తొలగిపోతాయి. ఈ చిట్కాను క్రమం తప్పకుండా రోజూ పాటించడం వల్ల చాలా త్వరగా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
పెరుగు -శనగపిండి -కాఫీ ప్యాక్
చిక్కటి పెరుగు, శనగపిండి, కాఫీపొడి కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి పట్టించాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ పై అప్లై చేసి తేలికపాటి చేతులతో మసాజ్ చేయండి. 2-3 నిమిషాల పాటు మసాజ్ చేసిన తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని కడగాలి. వారానికి రెండు సార్లు ఈ పేస్ట్‌తో మసాజ్ చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ సులభంగా తొలగిపోతాయి.
పుదీనా ఆకు ప్యాక్
పుదీనా ఆకుల పెస్ట్ ద్వారా ఉపయోగించడం వల్ల సులభంగా బ్లాక్ హెడ్స్‌ను దూరం చేసుకోవచ్చు. బ్లాక్ హెడ్స్ తొలగించడానికి, పుదీనా ఆకులు, చిటికెడు పసుపును నీటిలో వేసి మరిగించాలి. ఆకులను మెత్తగా చేసి ముఖానికి పట్టించి కాసేపు అలాగే ఉంచి తేలికపాటి చేతులతో మసాజ్ చేయాలి. ఇప్పుడు గోరువెచ్చని లేదా సాధారణ నీటితో ముఖాన్ని కడగాలి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.