గంగా నదిలో కాలష్యాన్ని తొలగించడం దేశంలోని ప్రతీ ఒక్కరు తమ బాధ్యతగా భావిస్తున్నారు. ప్రధాని మోదీ పిలుపు మేలకు నమామి గంగే, గంగా ప్రహారీ ప్రాజెక్టుల్లో భాగమవుతూ స్వచ్ఛమైన నీటి ప్రవహానికి తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ చొరవ మేరకు రాష్ట్రాల సహకారంతో చేపట్టిన ప్రాజెక్టు ఇప్పుడు గంగా నదీ స్వరూపాన్నే మార్చేసి అందమైన నందనవనంగా నిలబెట్టింది.
గంగా ప్రహారీతో అద్భుతాలు
గంగా నది శుద్ధీకరణలో భాగంగా 2014లో కేంద్ర ప్రభుత్వం నమామి గంగే ప్రాజెక్టును ప్రారంభించింది. నదిని శుభ్రపరచడం, అక్కడి జీవజంతు జాలాన్ని కాపాడటం, పరిసర గ్రామాల్లో కాలుష్యం ప్రజల కూడా చూడడం ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశం. దేశం జనాభాలో 40 శాతం అంటే దాదాపు 60 కోట్ల మంది గంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో నివశిస్తున్న సంగతిని గుర్తించిన కేంద్రం నమామి గంగే ప్రాజెక్టులు అమలు చేసింది. 2.500 జీవ జంతువులు గంగానదిపై బతుకుతున్నాయి. జీవుల సహజ ఆవాసాలను పునరుద్ధరించే ప్రక్రియగా ఐక్యరాజ్యసమితి 2022 డిసెంబరులో దీన్ని గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఐదు బిలియన్ డాలర్లు వ్యయం చేసింది.
2016 నుంచి గంగా ప్రహారీ
గంగ నది ప్రక్షాళణలో సామాన్య ప్రజలను భాగస్వాములను చేసే దిశగా కేంద్రం, యూపీ ప్రభుత్వం కలిసి 2016లో గంగా ప్రహారీ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. గంగలో, గంగ ఒడ్డున తిరిగి పక్షులు, జీవుల పట్ల జనంలో అవగాహన పెంచి వాటికి కష్టం వచ్చినప్పుడు ఎలా ఆదుకోవాలో శిక్షణ ఇచ్చారు. అలా శిక్షణ పొందిన వారిని గంగా ప్రహారీ అని పిలుస్తున్నారు. ఈ పనిలో పిల్లలకు కూడా ట్రైనింగ్ ఇచ్చి వారిని బాల ప్రహారీ అని పిలుస్తున్నారు. శీతాకాలం వస్తే 300 రకాల పక్షులు విదేశీ గడ్డ మీద నుంచి గంగను తాత్కాలిక నివాసంగా మార్చుకుంటాయి. వాటికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఏదైనా దెబ్బ తగిలి గాయవడినా దగ్గర్లోని పశువుల ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించే బాధ్యతను గంగా ప్రహారీలు తీసుకుంటున్నారు. వచ్చిన విదేశీ పక్షులను మన దేశానికి అతిధులుగా పరిగణిస్తున్నారు.
4 వేల మంది వాలంటీర్లు
గంగా ప్రహారీలుగా పిలిచే టాస్క్ ఫోర్స్ లో 4 వేల మంది వాలంటీర్లున్నారు. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్, పశ్చిమ బెంగాల్లోని వంద జిల్లాల్లో వాళ్లు గంగ ఒడ్డున తమ సేవలను అందిస్తున్నారు. గంగా నదిలోకి జనం చెత్తా చెదారం పడెయ్యకుండా చూస్తున్నారు. వ్యర్థ జలాలను గంగలోకి వదిలే వారిపై ఫిర్యాదు చేసే అధికారం కూడా వారికి ఉంది.
గంగా ప్రహారీలు రంగ ప్రవేశం చేసిన తర్వాత గంగా నదిలో కాలుష్యం తగ్గి పరిస్థితి మెరుగైందని ప్రభుత్వమూ, ప్రజలు ఒప్పుకుంటున్నారు. విద్యా సంస్థలు, గ్రామ పంచాయతీల ద్వారా వాలంటీర్లను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోంది. గంగా ప్రహారీలుగా సేవలందించే వాలంటీర్లకు ఉచిత ఉపాధి శిక్షణ ఇవ్వడం ద్వారా వారి జీవనోపాధికి కూడా ఆటంకం లేకుండా ప్రభుత్వం చూస్తోంది.
గంగా ప్రహారీల సాయంతో 99 జల శుద్ధీకరణ ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు అవకాశం వచ్చింది. మరో 48 ప్రాజెక్టు పనులు వేగం పుంజుకున్నాయి. 270 గంగా ఘాట్లను శుభ్ర పరిచే ప్రక్రియ నిరంతరం కొనసాగుతోంది. నదీ జలాలపై తుట్టెలు కట్టే చెత్తను తొలగించే పనిలో కూడా గంగా ప్రహారీల సేవలు ఉపయోగపడుతున్నాయి. ఏదేమైనా ప్రజల భాగస్వామ్యం లేకుండా పనులు సాగవని నమామి గంగే కార్యక్రమం నిరూపించింది….