సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు ప్రత్యేకతలు మాములుగా లేవు

సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే వందేభారత్ రైలు ను ప్రధాని మోడీ మరికాసేపట్లో ప్రారభించబోతున్నారు. రేపటి నుంచి ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో ఈ రైలు ప్రత్యేకతల ఫై ఓ లుక్ వేద్దాం. ప్రతి రోజు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి అనేక ట్రైన్స్ నడుస్తున్నాయి..ఈ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ లో 12 గంటల ప్రయాణం పడుతుంది. కానీ వందే భారత్ ట్రైన్ లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 8.30 గంటల ప్రయాణం ఉంటుంది. దేశంలో ఇది 13వ వందే భారత్ ట్రైన్.. ఇందులో 8 కోచ్ లు 530 సీటింగ్ కెపాసిటీ కాగా… 1 ఎగ్జిక్యూటివ్, 7 చైర్ కార్ కోచ్ లు ఉంటాయి. ప్రయాణికుల ఆదరణ దృష్ట్యా కోచ్ లను పెంచే అవకాశం ఉంది. వందే భారత్ ట్రైన్ స్పీడ్ గంటకు 77 కిలోమీటర్లు వెళుతుంది. ఈ రైల్ లో దూరాన్ని, ప్రయాణించే బోగీని బట్టి ధరలు నిర్ణయించారు. కనిష్ఠ ధర రూ. 470 కాగా, గరిష్ఠంగా రూ. 3,080గా ఖరారు చేశారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి చైర్ కారు టికెట్ ధర రూ. 1,680. తిరుపతి నుంచి సికింద్రాబాద్ కంటే, సికింద్రాబాద్ నుంచి తిరుపతి టికెట్ ధర రూ. 50, రూ. 55 ఎక్కువగా ఉంది.

సికింద్రాబాద్ నుంచి చైర్‌కార్, ఎగ్జిక్యూటివ్ ధరలు చూస్తే..

  • నల్గొండకు రూ. 470, రూ. 900
  • గుంటూరుకు రూ. 865, రూ. 1,620
  • ఒంగోలు రూ. 1,075, రూ. 2,045
  • నెల్లూరు రూ. 1,270, రూ. 2,455
  • తిరుపతి రూ. 1,680, రూ. 3,080

తిరుపతి నుంచి చైర్‌కార్, ఎగ్జిక్యూటివ్ ధరలు చూస్తే..

  • నెల్లూరుకు రూ. 555, రూ. 1,060
  • ఒంగోలు రూ. 750, రూ. 1,460
  • గుంటూరు రూ. 955, రూ. 1,865
  • నల్గొండ రూ. 1,475, రూ. 2,730
  • సికింద్రాబాద్ రూ. 1,625, రూ. 3,030

వారానికి 6 రోజులు మాత్రమే సికింద్రాబాద్ – తిరుపతి మధ్య వందే భారత్ ట్రైన్ రాకపోకలు కొనసాగనున్నాయి.