సౌత్ హీరోయిన్లంతా ఇప్పుడు బాలీవుడ్ పై పడ్డారు. ఒకప్పుడు నార్త్ హీరోయిన్స్ ని సౌత్ కి తీసుకురావడం ఎంత కష్టమో..సౌత్ బ్యూటీస్ నార్త్ లో అడుగుపెట్టడం అంతే కష్టం అయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. దక్షిణాది ఇండస్ట్రీ ఉత్తరాదిని మించి దూసుకుపోతోంది. దీంతో మన ముద్దుగుమ్మలకు అక్కడ క్రేజ్ పెరిగింది. రీసెంట్ గా జవాన్ సినిమాతో బీటౌన్‌లో జెండా పాతేసింది నయనతార. తాజాగా ఆ లిస్టులో చేరింది సమంత.
సల్మాన్ తో సామ్
రీసెంట్ గా మయోసైటిస్ చికిత్స కోసం అమెరికా వెళ్లి వచ్చింది సమంత. చికిత్స పూర్తైన తర్వాత నేరుగా హైదరాబాద్ కి వచ్చేసిన సమంత ఆ తర్వాత ముంబైకి వెళ్లింది. ప్రస్తుతం అక్కడ తన కెరీర్ జర్నీ గురించి సీరియస్ గా ప్లాన్ చేసుకుంటోదట. ఈ మధ్యే కరణ్ జోహార్ ని సామ్ పార్టీలో కలుసుకోవడంతో ఆ ఇద్దరూ కలసి ఓ ప్రాజెక్ట్ కోసం పనిచేయాలని ఫిక్సయ్యారని టాక్. ధర్మ ప్రొడక్షన్స్‌లో చేయబోయే చిత్రంలో సల్మాన్‌ఖాన్ తో సాన్ ను ఫైనల్ చేయాలని డిసైడయ్యాడట కరణ్. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటివరకూ క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.
సౌత్ కనెక్షన్ ఉన్న సీన్స్ హైలెట్
సల్మాన్ సరసన సమంత నటించడం దాదాపు ఖాయమైనట్టే అని టాక్. ఆ కరణ్ దర్శకత్వం వహించిన రాఖీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ సక్సెసయ్యాక సల్మాన్ ఓ ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలో నటించాలనుకుంటున్నాడు. ఇందులో సమంతతో సౌత్ కనెక్షన్ ఉన్న సీన్స్ ని ఎలివేట్ చేయాలనేది ప్లాన్. అందుకే కరణ్ – సామ్ ఈ ప్రాజెక్ట్ కోసం చర్చించేందుకే కలుసుకున్నారన్న టాక్ ఉంది.
జవాన్ లో నయన్ కాదు సామ్
వాస్తవానికి షారుక్ రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘జవాన్’ సినిమాతో సమంత బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. అట్లీ మొదట సమంతనే సంప్రదించాడు. కానీ సమంత అప్పటికే అనారోగ్య సమస్యతో బాధపడడం, బ్రేక్ తీసుకోవాలని ఫిక్సవడం జరిగింది. ఆ తర్వాత ఆ ప్రాజెక్టులో నయనతార ఫైనలైంది. దీపికా పదుకొనే పాత్ర కోసం కూడా సమంతను సంప్రదించాడని టాక్. అప్పట్లో సామ్ ఏ సినిమాలకు సంతకం చేయలేదు. ఏదేమైనా ఖాన్ తో మిస్సైన ప్రాజెక్ట్ మరో ఖాన్ తో ఫైనలవడం ఇంట్రెస్టింగ్. ఆ ప్రాజెక్ట్ మిస్సవడానికి కారణం ఏమైనా కానీ భాయ్ తో ఆఫర్ సామ్ మిస్ చేసుకోకూడదంటున్నారు ఫ్యాన్స్. మరి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడొస్తుందో…