పది మంది హీరోల సినిమాలు చూడాలి… మళ్లీ జనసేనకు జీతం సమర్పించాలా ? – మెగా ఫ్యాన్స్ ఆవేదన

మెగా ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు బయటకు చెప్పుకోలేని ఆవేదనలో ఉన్నారు. తమ హీరోలు సినిమాల మీద సినిమాలు విడుదల చేస్తున్నారు. మరో వైపు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ విరాళాలు అడుగుతోంది. అది కూడా ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ తరహాలో జరుగుతూండటంతో ఫ్యాన్స్ ఇదేం పితలాటకం అనుకుంటున్నారు.

జనసేనకు ఒక్క రోజు శాలరీ ఇవ్వాలని ప్రచారం

జనసేనకు నిధుల సమస్యను పరిష్కరించేందుకు జనసైనికులు తమ ఒక రోజు సంపాదనను పార్టీకి కేటాయించాలన్న ఉద్యమాన్ని ఆన్ లైన్ లో నిర్వహిస్తున్నారు. పవన్ కల్యాణ్.. పుట్టిన రోజు వేడుకలు దగ్గరకు వచ్చాయి. పవన్ బర్త్ డే సందర్భంగా వేడుకలు చేయకుండా ఆ ఖర్చును జనసేనకు విరాళంగా ఇవ్వాలన్న ఓ క్యాపెంయిన్ తో కార్యకర్తలు …. కష్టపడుతున్నారు. ఒక రోజు అంతా ఎక్కడైనా పని చేసి ఆ డబ్బులు జనసేనకు ఇవ్వాలన్నమాట. ఉద్యోగులైతే.. ఉద్యోగులు..లేకపోతే కూలీ చేసుకునే వారు. ఇలా ఇవ్వని వారు పవన్ ఫ్యాన్స్ కాదన్నట్లుగా కొంత మంది విమర్శలు చేస్తూండటంతో ఇదో రకం ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ గా సోషల్ మీడియాలో మారిపోయింది.

జనసేనను నడుపుతోంది కార్యకర్తలే !

జనసేనకు పవన్ కల్యాణ్ అభిమానులు అండగా ఉంటున్నారు. ఐదారు శాతం ఓట్లు కూడా సాధించలేకపోతూండటంతో కార్పొరేట్ సంస్థలు… విరాళాలు ఇవ్వడం లేదు. పార్టీని సొంతంగా నడుపుకోవాలి. అందు కోసం పవన్ సినిమాలు చేస్తున్నానని చెబుతున్నారు. ఎన్నికల సమయంలో నిధుల అవసరం ఎక్కువగా ఉంటుందని.. అందుకే అందుకే … ఒక రోజు శాలరీ ఇవ్వాలనిప్రచారం చేస్తున్నారు. జనసైనికులు అందరూ… తమ ఒక రోజు ఆదాయాన్ని జనసేనకు ఇస్తే… పెద్ద ఎత్తున నిధులు జమ అవుతాయి. ఇప్పటికీ పార్టీ కార్యకర్తలే …. పార్టీకి విరాళాలు అందిస్తున్నారు. అయితే ఇలా చేయడంపై విమర్శలు వస్తాయని.. అధికారికంగా జనసేన ఎక్కడా పిలుపునివ్వడం లేదు.

మెగా అభిమానుల్లో ఆందోళన

ప్రజారాజ్యం పార్టీ ప్రారంభించినప్పుడు చిరంజీవిని నమ్ముకున్న ఓ వర్గం ఆర్థికంగా కుదేలైపోయిందని చెబుతారు. ఇప్పుడు పవన్ పార్టీతో.. మరింతగా కుదేలవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఓ వైపు మెగా బ్రాండ్ తో వస్తున్న సినిమాల కోసం కూడా పెద్ద మొత్తంలో ఫ్యాన్స్ వెచ్చిస్తున్నారు. ఇవి రాను రాను ఎక్కువ అవడంతో… ఓపెనింగ్స్ రావడం కూడా కష్టంగా మారుతోంది. మెగా ఫ్యాన్స్ మెగా కుటుంబం కోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోందని … సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.