తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికలను ఎదుర్కొంటున్న అధికార పార్టీ కాన్ఫిడెన్స్ చూస్తే .. నిజంగా గెలుపు దిశగా ఉందా ఓటమి బాటలో ఉందా అన్నదానిపై స్పష్టత వచ్చేస్తుంది. తెలంగాణలో బీఆర్ఎస్ నేతల ప్రకటనలు, ప్రచారాలు చూస్తే.. ముందుగానే ఓడిపోతున్నట్లుగా క్లారిటీ వస్తోందని జనం కూడా అనుకుంటున్నారు. పదేళ్ల ప్రజా వ్యతిరేకత పాలనతో పూర్తి స్థాయిలో ఓటమి భయంలో బీఆర్ఎస్ ఉందని కేసీఆర్, కేటీఆర్ మాటల్లోనే స్పష్టమవుతోంది.
ఓడగొట్టొద్దని బతిమాలుతున్న బీఆర్ఎస్ అగ్రనేతలు
” అభివృద్ధి చేసేవాళ్లు ఇంకొన్నాళ్లు అధికారంలో ఉంటే తప్పేంటని, బోర్ కొట్టిందని కొత్త ప్రభుత్వం రావాలని కోరుకుంటారా” అంటూ బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఓ ఎన్నికల సమావేశంలో వ్యాఖ్యలు చేశారు. మేము బాగా పరిపాలించాం.. మళ్లీ గెలిపిస్తే ఇంకా చేస్తాం ఓడగొట్టుకుంటే నేనేమీ చేయలేను అని కేసీఆర్… నర్సంపేట ప్రజా ఆశీర్వాద సభలో ప్రజలను ఉద్దేశించి అన్నారు. ఈ రెండు కామెంట్లు ఒకే రోజుచేశారు. కాస్త పరిశీలిస్తే దాదాపుగా రోజూ ఇలాంటి కోణంలోనే కేసీఆర్, కేటీఆర్ ప్రచారం చేస్తున్నారు.
మార్పు కోసం ఎదురూ చూస్తున్న ప్రజలు
కేసీఆర్, కేటీఆర్ ఇద్దరి ప్రచార సరళిలో ప్రజల్లో మార్పు కనిపిస్తోందని.. దాన్ని మార్చాలన్న వ్యూహం కనిపిస్తోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం రాజకీయవర్గాల్లో మౌత్ టాక్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ మౌత్ టాక్ బీజేపీ వైపు మళ్లుతోంది. బీసీ సీఎం నినాదం, ఎస్సీ వర్గీకరణ, పవన్ కల్యాణ్ మద్దతు వంటి అంశాలతో ఈ సారి బీజేపీ అనే నినాదం అంతకంతకూ పెరుగుతున్న సూచనలు కనిపిస్తూండటంతో బీఆర్ఎస్ పెద్దలు అప్రమత్తమయ్యారు. అనవసరంగా రిస్క్ తీసుకోవద్దని ఓటర్లను హెచ్చరిస్తున్నారు. కానీ ఈ హెచ్చరికలు రివర్స అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
బీజేపీ వస్తే ఏదో జరుగుతుందని తప్పుడుజ ప్రచారం
బీజేపీ వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికి బీఆర్ఎస్ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. దీనికి కారణం ప్రజల్లో బీజేపీ హామీలపై ఆసక్తి పెరగడం ఆ పార్టీకి కూడా ఓ చాన్సివ్వాలన్న ఆలోచన రావడమేనని దీనని బీఆర్ఎస్ అగ్రనేతలు గుర్తించి.. విరుగుడు ప్రకటనలు చేస్తున్నారంటున్నారు. అయితే వారు చేస్తున్న ప్రకటనలు.. .ముందే ఓటమిని అంగీకరించినట్లుగా ఉంటున్నాయని విప్కష నేతలు సెటైర్లు వేస్తున్నారు. అయితే కేసీఆర్ రాజకీయాన్ని ఊహించడం కష్టం. ఆ మాటలు కాస్త వెనుకబడ్డామన్న అభిప్రాయాన్ని కల్పించినా… మేలు చేస్తాయని నమ్ముతున్నారని అంటున్నారు.
మొత్తంగా తమ పరిస్థితి గడ్డుగా ఉందని… బీజేపీ బీఆర్ఎస్ అగ్రనేతలు తమ మాటల ద్వారానే అంగీకరిస్తున్నారు. ఇక గ్రౌండ్ రియాలిటీలో ఇంకెంత ఘోరంగా ఉందో ?