సొంత ఎమ్మెల్యేలపై కేసీఆర్ “అవినీతి స్కెచ్” రివర్స్ – విచారణ చేయక తప్పదా ?

టిక్కెట్లు ఎగ్గొట్టాడనికి సొంత ఎమ్మెల్యేలపై అవినీతి ముద్ర వేసినట్లుగా విమర్శలు ఎదుర్కొంటున్న కేసీఆర్‌కు అనూహ్యమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. ద‌ళిత‌బంధు ప‌థ‌కం కొంత మందికి అందిస్తున్నా, అక్క‌డ కూడా క‌మీష‌న్లు దండుకుంటున్నార‌ని స‌మాచారం. ఎమ్మెల్యేలు కొంద‌రు అవినీతికి పాల్ప‌డుతున్నారంటూ చేసిన వ్యాఖ్య‌లే ఇందుకు నిద‌ర్శ‌నం. ఎమ్మెల్యేల‌ను హెచ్చ‌రించేందుకు ఈ వ్యాఖ్య‌లు చేశారో లేక‌, నిజంగానే ఈ మాట‌లు అన్నారోగాని, వీటిని ప్ర‌తిప‌క్షాలు గ‌ట్టిగా ప‌ట్టుకున్నాయి.

విచారణ కోసం డిమాండ్ చేస్తున్న విపక్షాలు

ఎమ్మెల్యేలు అవినీతికి పాల్ప‌డ్డార‌ని స్వ‌యంగా ముఖ్య‌మంత్రే చెబుతున్నార‌ని, అవినీతికి పాల్ప‌డిన ఎమ్మెల్యేల చిట్టాను పోలీసుల‌కు అంద‌జేయాల‌ని ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రెస్ మీట్ పెట్టి మీడియా సాక్షిగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. ఒక‌వేళ నిజంగా ఎమ్మెల్యేలు అవినీతికి పాల్ప‌డితే, సీఎం వారిని ప‌క్క‌కు పిలిచి వార్నింగ్ ఇస్తే స‌రిపోయేది. నేరుగా ప్లీన‌రీలో ఈ అంశాన్ని లేవ‌నెత్త‌డం ప్ర‌తిప‌క్షాల‌కు ఒక అస్త్రాన్ని ఇచ్చినట్టైంది. ఇప్పుడు కేసీఆర్ ఆరోపణలపై విచారణ చేయించాలని.. బీజేపీ కూడా డిమాండ్ చేస్తోంది. హైకోర్టు సుమోటోగా తీసుకోవాలని రఘునందన్ రావు డిమాండ్ చేస్తున్నారు.

ఎమ్మెల్ని బలి చేసి తాను బయటపడాలనుకుంటున్నారా ?

అవ‌త‌లి వారిని బలి చేసి తాను బయటపడే రాజకీయం కేసీఆర్‌కు రాజ‌కీయంతో పెట్టిన విద్య‌. ఆప‌త్కాలంలో ఆయ‌న ఇలాంటి వ్యూహాల‌కు ప‌దును పెడుతుంటారు. ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో 70 శాతం మందికి తాము గెలుస్తామ‌నే నమ్మ‌కం లేదు. స‌ర్వేలు కూడా అదు చెబుతున్నాయి. ఇలా చూసుకున్నా వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీకి 40 కి మించి గెలిచే అవ‌కాశం లేదు. ఇక ప్ర‌తిప‌క్షాలు గ‌తంలో మాదిరిగా బ‌ల‌హీనంగా లేవు. దీనికి ఉదాహ‌ర‌ణ బీజేపీనే. 2018లో కేవ‌లం ఒక్క‌స్థానం మాత్ర‌మే గెలుచుకోగా ఆ త‌రువాత జ‌రిగిన పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో నాలుగు చోట్ల విజ‌యంసాధించింది. మూడు ఉప ఎన్నిక‌ల్లో రెండు చోట్ల విజ‌యం సాధించింది. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎత్తి చూప‌డం, వాటిని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంలో ప్ర‌తిప‌క్షాలు విజ‌యం సాధిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎమ్మెల్యేలను బలి పశువుల్ని చేయాలనుకుంటున్నారన్న అనుమానాలు ప్రారంభించాయి.

బలం పుంజుకుని సవాల్ గా మారిన బీజేపీ.

బీజేపీ రాష్ట్రంలో బ‌లం పుంజుకుంటోంది. రెండుసార్లు సెంటిమెంట్ వ‌ర్కౌట్ అవ్వ‌గా, ఈసారి సెంటిమెంట్ పేరుతో ముందుకు వెళ్ల‌లేని ప‌రిస్థితి.. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ మరోసారి గెలిస్తే తెలంగాణలో పాజిటివ్ వేవ్ వస్తుంది. అలాంటిది వస్తే ఇక తట్టుకోవడం కష్టమని కేసీఆర్‌కు బాగా తెలుసంటున్నారు. అందుకే కొత్త స్ట్రాటజీని అమలు చేయాలనుకుంటున్నారు కానీ అది రివర్స్ అవుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.