రాయలసీమకు ఎప్పుడూ జరగనంత అన్యాయం – ప్రజలకు వైసీపీ సమాధానం చెప్పాలన్న ఏపీ బీజేపీ

రాయలసీమకు ఎప్పుడూ ఎవరూ చేయనంత అన్యాయాన్ని ప్రస్తుత ఏపీ ప్రభుత్వం చేస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురదేశ్వరి ఆరోపిచారు. రాయలసీమ ఏడు జిల్లాల జోనల్ మీటింగ్ లో పాల్గొనడానికి ప్రొద్దుటూరు చేరుకున్న ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అరాచకాలపై మండిపడ్డారు

అన్ని వర్గాల అభివృద్ధే బీజేపీ ధ్యేయం

మొట్టమొదటి సారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా కడప వచ్చానని.. రాష్ట్ర పర్యటన రాయలసీమ నుంచి ప్రారంభించడం సంతోషదాయకమన్నారు. తన తండ్రి దివంగత మహానేత నందమూరి తారకరామారావు రాయలసీమ నుంచే రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారని గుర్తు చేసుకున్నారు. అన్ని వర్గాల వారి సంక్షేమమే బీజేపీ ధ్యేయమన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పేదరికంలో పుట్టి పెరిగారన్నారు. అందుకే పేదల పక్షాన ఉంటారని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏపీ ఏర్పడ్డాక అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి… కేంద్రం ఇచ్చిన నిధులతో అభివృద్ధి జరుగుతోందన్నారు.

22 లక్షల ఇళ్లిచ్చిన కేంద్రం – ఏపీ సర్కార్ ఎన్ని నిర్మించింది ?

ఏపీ కి కేంద్రం 22 లక్షల ఇల్లు మంజూరు చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతమేరకు ఇల్లు నిర్మించిందని దగ్గుబాటి పురందేశ్వరి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి రంగులు మార్చుకోవడం ఉన్న శ్రద్ద ఇళ్ల నిర్మాణం లో లేదన్నారు. మద్యం తో వైసిపీ ప్రభుత్వం జేబులు నింపు కుంటుందని.. ప్రజల ప్రాణాలను పణంగా పెడుతోందని విమర్శించారు. మైనింగ్ వైసిపీ ప్రభుత్వానికి కావాల్సిన వారికి ఇచ్చుకుని అక్రమార్జనకు పాల్పడ్డారన్నారు. కేంద్రం సర్పంచు లకు నిధులు ఇస్తే వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళించిందని.. ప్రకాశం జిల్లాకు చెందిన సర్పంచులు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మ హత్యాయత్ననికి పాల్పడ్డారన్నారు. సర్పంచులకు కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇసుక విషయంలో వైసీపీ ప్రజాప్రతినిధులు భారీ దోపిడీకి తెర తీశారని ఆరోపించారు.

అన్నమయ్య బాధితులకు ఇప్పటి వరకూ న్యాయం చేయలేదు !

రాష్ట్రం లో అభివృద్ధి శూన్యమయిందని.. రాష్ట్రంలో ప్రాజెక్టు ల పరిస్థితి అద్వాన్నంగా ఉందన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నల్లేరు మీద నడకలా సాగుతుందని మండిపడ్డారు. అన్నమ్మయ్య డ్యామ్ గేటు కొట్టుకుపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు మరమ్మత్తులు చేయలేదని విమర్శించారు. వరదల్లో ఇల్లు కొట్టుకుపోయిన వారికీ ఇంత వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇవ్వలేదన్నారు. 3 నెలల్లో వరద బాధితులకు ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన సిఎం జగన్ మాట నిలబెట్టుకోలేకపోయారన్నారు. కడప స్టీల్ ప్లాంట్ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తామని నిరుద్యోగ యువత ను మోసం చేసింది…నిరుద్యోగ యువత వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏపీ లో ఏర్పడిందిన్నారు. నేషనల్ హై వే లకు వేల కోట్లు మంజూరు చేసిన ఘనత కేంద్ర లోని బీజేపీ దన్నారు. ఏపీ లో అభివృద్ధి కి కేంద్ర సహకారం ఉందని.. కానీ వినియోగించుకోలేకపోతోందన్నారు.