రవితేజ ‘ఈగల్’ టీజర్ భలే థ్రిల్లింగ్ గా ఉంది!

ధమాకా సక్సెస్ ఊపులో ఉన్న రవితేజ తాజా మూవీ టైటిల్ ఈగల్ అని ఫిక్స్ చేశారు. టైటిల్ తో పాటూ టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఒక మనిషి చుట్టూ ఇన్ని కథలేంటీ? ఒక వ్యక్తికి ఇన్ని అవతారాలేంటి అంటూ సాగే టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.

మాస్ మహారాజ్ రవితేజ జెట్ బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా బలమైన కథలతో కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రాలు చేస్తూనే ప్రయోగాలకి కూడా సై అంటున్నాడు. ఇప్పుడు అలాంటి థ్రిల్లింగ్ కథాంశంతోనే ఈగల్ గా వస్తున్నాడు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటూ టీజర్ కూడా విడుదల చేశారు.

‘ఈగల్’ టీజర్లో ఏముందంటే
వాంటెడ్ పెయింటర్ అని పేపర్ క్లిప్స్ ఓ గోడకి అతికించి ఉంటాయి. ఒక పెయింటర్ ని పట్టుకోవడానికి ఇంత పెద్ద టీమ్ రా ఏజెన్సీ అంటూ ఓ అమ్మాయి క్వశ్చన్ చేయడంతో టీజర్ స్టార్ట్ అయింది. పెయింటరా పత్తి పండించే రైతు ఆ సామి దినాము పంట గురించే ఆలోచన అని డైలాగ్స్ తో మరో యాంగిల్ గా క్యారెక్టర్ గురించి రిప్రజెంట్ చేశారు. వెంటనే కొంత మంది చూపు మనిషి ఊరిపి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు అని నవదీప్ చెప్పే డైలాగ్ తో టీజర్ ని యాక్షన్ మోడ్ లో తీసుకెళ్లాడు. ఒక మనిషి చుట్టూ ఇన్ని కథలేంటి, ఒక వ్యక్తికి ఇన్ని అవతారాలేంటని అనుపమ పరమేశ్వరన్ క్వశ్చన్ చేయగానే ఓ లేక్ దగ్గర టోపీ తీసుకుంటున్న హీరో క్యారెక్టర్ ని సగం రివీల్ చేసి వెంటనే ఒక గ్రద్ద ఆకాశంలో ఎగడం చూపించారు. బులెట్ గ్రద్ద లా మారి ఎగురుతూ ఈగల్ టైటిల్ ని చీల్చుకుంటూ వెళ్తుంది. ఓవరాల్ గా టైటిల్ ఎనౌన్స్ మెంట్ టీజర్ మాత్రం చాలా ఇంటరెస్టింగ్ గా థ్రిల్లింగ్ గా ఉంది.

2024 సంక్రాంతికి విడుదల
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ-అనుపమా పరమేశ్వరన్, మధుబాల, నవదీప్ నటిస్తోన్న ఈ సినిమాకు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కుచిబొట్ల నిర్మాతలు. ద్వజాంద్ సంగీత దర్శకుడు. ఈ మూవీని 2024 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు టీజర్ ద్వారా ప్రకటించారు.

రవితేజ బిజీ బిజీ
ఇటీవలే రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ పోస్టర్‌ను గోదావరి రైల్వే బ్రిడ్జి మీద భారీ స్థాయిలో విడుదల చేశారు. ఇప్పుడు ఈగల్ తో పాటూ మరో ప్రాజెక్టులో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ‘కలర్ ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో మరో మూవీలో రవితేజ లెక్చరర్ గా శర్వానంద్ స్టూడెంట్ గా నటిస్తున్నాడని టాక్. గురు శిష్యుల మధ్య బంధం కథలో కీలకమైన అంశం అని, వాళ్ళ రిలేషన్, ఎమోషన్, మనస్పర్థలు వంటివి హైలైట్ చేస్తూ సందీప్ రాజ్ కథ రాశాడట. మొత్తానికి మాస్ మహారాజ్ జోరు మామూలుగా లేదు…