జనవరి 15 నుంచి 22 వరకూ అయోధ్యలో రామయ్యకు జరిగే కార్యక్రమాలివే!

రామజన్మభూమిలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు సన్నాహాలు చివరి దశలో ఉన్నాయి, ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రతిష్టాపన కార్యక్రమం జనవరి 22న జరగబోతున్నప్పటికీ వారం ముందునుంచే సందడి మొదలుకానుంది. జనవరి 16 నుంచి 22 వరకూ ఏ రోజు ఏ కార్యక్రమాలు జరుగుతాయంటే…

అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ పూర్తి షెడ్యూల్‌ ఇదే

జనవరి 15 మకర సంక్రాంతిలో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది

జనవరి 16 శ్రీరాముని విగ్రహానికి ప్రతిష్ఠాపన ఆచారాలు మొదలవుతాయి

జనవరి 17 విగ్రహాల ఊరేగింపుతో పాటూ సరయు నదినుంచి నీటిని కలశాలతో తీసుకెళ్తారు

జనవరి 18 మండప ప్రవేశ పూజ, వాస్తు పూజ, వరుణ పూజ, విఘ్నహర్త గణేశ పూజ, మార్తిక పూజ వంటి ఆచారాలతో పవిత్రోత్సవం ప్రారంభమవుతుంది.

జనవరి 19
రామమందిరంలో యజ్ఞ అగ్నిగుండం స్థాపన జరుగుతుంది

జనవరి 20
విధ నదుల నుంచి సేకరించిన నీటిని కలిగి ఉన్న 81 కలశాలతో రామమందిరం గర్భగుడిని పవిత్రం చేస్తారు..వాస్తు శాంతి కార్యక్రమాలు నిర్వహిస్తారు

జనవరి 21
యజ్ఞం సందర్భంగా.. ప్రత్యేక పూజలు హవనాల మధ్య శ్రీరామ చంద్రుడు 125 కలశాలతో దివ్య స్నానమాచరిస్తాడు

జనవరి 22
ప్రధాన ఘట్టమైన ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. మృగశిర నక్షత్రం సందర్భంగా మధ్యాహ్న సమయంలో శ్రీరామునికి ప్రత్యేక పూజలు చేస్తారు

ప్రాణ ప్రతిష్ఠా ముహూర్తం
జనవరి 22 మధ్యాహ్నం 12:29 నుంచి 12:30:32 PM వరకు…

అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం రోజు జనవరి 22న దేశ ప్రజలందరూ దీపావళి జరుపుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ రోజు సాయంత్రం ప్రతి ఇంట్లో దీపం వెలిగించాలన్నారు. అందుకే జనవరి 22 వ తేదీన అయోధ్యలో ఉండే రద్దీ కారణంగా భక్తులు ఎవరూ అయోధ్యకు రావొద్దని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆ తర్వాతి రోజు అంటే జనవరి 23 వ తేదీ నుంచి జీవితాంతం శ్రీరాముడిని దర్శించుకోవచ్చని సూచించారు. రద్దీలో అయోధ్యకు వచ్చి ఇబ్బంది పడేకన్నా రద్దీ తగ్గిన తర్వాత రామయ్యను దర్శించుకోవాలని సూచించారు. ప్రజలెవరూ ఇబ్బంది పడకూడదనే ఈ సూచన అని చెప్పారు..