‘తాతగారూ మీరు ఇంకా ఉన్నారా..’ పెద్దాయనను పట్టుకుని ఆర్జీవీ అంతమాట అనేశాడేంటీ..?

నాగార్జున యూనివర్సిటీ (Nagarjuna University)లో వివాదాస్పద డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ (Ram Gopal Varma) చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. కాగా.. ఈ వ్యాఖ్యలపై అటు ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ నాయకులే కాదు.. తెలంగాణ నేతలు కూడా మండిపడుతున్నారు. కాగా.. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ స్పందించారు. ఆర్జీవీ మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు. మహిళలను ఉద్దేశించి ఆర్జీవీ చేసిన కామెంట్లు సరికాదని మండిపడ్డారు. ఇప్పటివరకు ఆర్జీవీ కామెంట్లపై సినీ పరిశ్రమ నుంచి ఎవ్వరూ స్పందిచలేదని.. ఇలాగే వదిలేస్తే మహిళలను అవమానించడం అలవాటవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్మకు దమ్ముంటే ఉస్మానియా లేదా కాకతీయ యూనివర్సిటీకి వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేయమనండని సవాల్ విసిరారు వీహెచ్. నాగార్జున యూనివర్సిటీ వీసీ రాజశేఖర్‌ను సస్పెండ్‌ చేసి, ఆర్జీవీ మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే.. పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తామని వీహెచ్‌ హెచ్చరించారు.

అయితే.. వీహెచ్ చేసిన వ్యాఖ్యలపై ఆర్జీవీ తనదైన స్టైల్‌లో సెటైరికల్‌గా స్పందించారు. “ఓ తాతగారూ మీరింకా వున్నారా??? NASA యాక్ట్ వర్తించదు TADA యాక్ట్‌ని 1995 లోనే తీసేశారు.. ఇది కూడా తెలియని మీ లాంటి లీడర్స్ మూలానే కాంగ్రెస్‌కి ఆ గతి.. ఒక సారి డాక్టర్‌కి చూపించుకొండి.” అంటూ దుబాయ్ శీను సినిమాలోని డైలాగ్‌తో వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు. ఈ కౌంటర్‌ మీద నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు వస్తున్నాయి. కొందరు ఆర్జీవీకి సపోర్ట్‌గా వీహెచ్‌పై సెటైర్లు వేస్తుంటే.. మరికొందరు ఆర్జీవీని తిడుతూ కామెంట్లు చేస్తున్నారు.