“పీవోకే” మనదే – మోడీ, షా నెక్ట్స్ టార్గెట్ అదే !

పాక్ ఆక్రమిత కఅక్కడ కొన్నేళ్లుగా నిత్యం ఆందోళనలు, తిరుగుబాట్లు జరుగుతున్నాయి. తాజాగా ద్రవ్యోల్బణం, అధిక పన్నులు, విద్యుత్తు కొరత పై జమ్ముకశ్మీర్‌ జాయింట్ ఆవామీ యాక్షన్‌ కమిటీ ఆందోళనలు చేపట్టింది. పీవోకే హింసతో దద్దరిల్లింది. పీవోకే నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్తును మిగతా పాకిస్థాన్ వాడుకుంటోంది. కానీ పీవోకేకు కరెంట్ లేదు. కనీసం గోధుమ పిండి కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఈ వివక్షను నిరసిస్తూ తిరుగుబాటు మొదలైంది. స్వాతంత్య్రం కావాలంటూ రోడ్లపైకి వస్తున్నారు. పీవోకేను భారత్‌ లో కలుపాలని కోరుతూ పోస్టర్లు వెలిశాయి. ఇలాంటి సమయంలో బీజేపీకి దేశ ప్రజలు మరింత మద్దతు ఇస్తే.. మరో ఏడాదిలో పీవోకేను భారత్ ను కలిపేయడం ఖాయమన్న భావన వ్యక్తమవుతోంది.

పార్లమెంట్‌లో అమిత్ షా ప్రసంగం ఇప్పటికీ చిరస్మరణీయమే !

ఆర్టికల్ 370 రద్దు చేసే రోజున పార్లమెంట్‌లో అమిత్ షా… పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి ధీరోధాత్తమైన ప్రకటన చేశారు.
చైనా ఆధీనంలో ఉన్న ఆక్సాయ్ చిన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను మళ్లీ భారత్‌లో అంతర్భాగం చేసేందుకు ప్రాణాలైనా అర్పిస్తామని అమిత్ షా ఎమోషనల్ గా ప్రకటించడం భారత సర్కార్ ఉద్దేశాన్ని చాటి చెబుతోంది.దాన్ని ఎలా స్వాధీనం చేసుకోవాలో తమకు తెలుసంటూ.. సంచలన ప్రకటన చేశారు. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని తుదముట్టించాలంటే ఆక్రమిత కశ్మీర్ స్వాధీనం చేసుకోవాల్సిందే. పీవోకేలోని ఆర్మీ క్యాంపులపై భారత సైన్యం సర్జికల్ దాడులు చేసింది. అక్కడి నుంచే… కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నారనే స్పష్టమైన నివేదికలు ఉన్నాయి. అందుకే.. పీవోకేను తిరిగి పొందాలన్న కృతనిశ్చయంతో.. కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇప్పుడు దానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

పీవోకేను స్వాధీనం కోసం బలమైన ప్రభుత్వం అవసరం

పీఓకేను పాకిస్తాన్ అంత తేలిగ్గా వదులుకోదు. పాకిస్తాన్ తమ భూభాగంగా భావిస్తున్న పీవోకేను.. సర్వనాశనం చేయడానికైనా అంగీకరిస్తుంది కానీ.. అప్పగించదు. . ఇప్పటికే రెండు సర్జికల్ దాడులతో సైన్యం సత్తా చూపించింది. అయితే పీఓకేను కలుపుకోవాలంటే చిన్న దాడులు సరిపోవు.. పెద్ద యుద్దమే చేయాల్సి ఉంటుందన్న అభిప్రాయం నిపుణుల నుంచి వస్తోది. అయితే పాకిస్తాన్ ఇప్పటికే దివాలా దిశలో ఉంది. పాకిస్తాన్ కు ఏ సాయం అందకుండా చేయడంలో మోడీ , షాలకు పెద్ద విషయం కాదు. ఆర్టికల్ 370 వ్యవహారంలో.. భారత్‌కు ప్రపంచదేశాలు మద్దతుగా నిలిచాయి. ఇదే వ్యూహం పీవోకే విషయంలోనూ అమలు చేయవచ్చు.

మోడీ , షా చేసి చూపిస్తారు..!

పీవోకేను.. భారత్‌లో చేర్చితే.. ప్రధాని మోడీ, అమిత్ షాలు చరిత్రలో నిలిచిపోతారు. ఎందుకంటే.. దేశ విభజన నాటి నుంచి.. సరిహద్దుల్ని ఉద్రిక్తతంగా ఉంచుతూ.. వస్తున్న.. సీమాంతర ఉగ్రవాదం… అంతమైపోతుంది. విశాల భారత్ ఏర్పడుతుంది. చైనా కూడా.. భారత్ పట్ల కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలనే భావనకు వస్తుంది. మోడీ, షా ఇది చేసి చూపిస్తారని ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నారు.