మొదటినుంచి హిందూపురం పార్లమెంటు బిజెపి అభ్యర్థిగా తానే పోటీలో నిలుస్తానని పలు సందర్భాల్లో పరిపూర్ణానంద స్వామీజీ ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆయన అసెంబ్లీకి రెబల్ గా పోటీ చేస్తున్నరాు. హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఇవ్వడంతో పరిపూర్ణానంద స్వామీజీ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. బిజెపి అధిష్టానంతో చర్చల అనంతరం తన రాజకీయ భవిష్యత్తు ప్రకటిస్తానని చెప్పిన పరిపూర్ణానంద స్వామీజీ హిందూపురం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
హ్యాట్రిక్ ఆశల్లో బాలకృష్ణ
హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆయన సతీమణి వసుంధర దేవి విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టారు. వైసిపి ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపై ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తూ ఓటును అభ్యర్థిస్తున్నారు. చంద్రబాబు హయాంలోనే హిందూపురం నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటూ ఈ ఎన్నికల్లో గెలిచి తీరుతానని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భీమా వ్యక్తం చేస్తున్నారు.
సామాజిక సమీకరణాలతో వైసీపీ
హిందూపురం నియోజకవర్గం లో ఇప్పటివరకు వైఎస్ఆర్సిపి పార్టీ గెలిచిన దాఖలాలు లేవు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే హిందూపురంలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈసారి ఎలాగైనా హిందూపురంలో వైసిపి జెండా ఎగరేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. హిందూపురం వైసీపీ అభ్యర్థిగా కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపికా రెడ్డిని ఈసారి వైసిపి అభ్యర్థిగా బరిలో నిలిచారు.
బాలకృష్ణ ఓటమి టార్గెట్ గా పరిపూర్ణానంద
హిందూపురం బిజెపి పార్లమెంటు అభ్యర్థిగా బరిలోకి దిగాలనుకున్న స్వామీజీ ఆశలు గల్లంతయ్యాయి కూటమి అభ్యర్థిగా హిందూపురం పార్లమెంటు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ నేత బికే పార్థసారని ప్రకటించారు. బాలకృష్ణ ఓటమి టార్గెట్ గా పరిపూర్ణనంద రంగంలోకి దిగారు. ఇప్పటివరకు హిందూపురంలో తెలుగుదేశం,వైసిపి పార్టీల మధ్య ప్రధాన పోటీ అనుకున్నారు.అయితే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పరిపూర్ణానంద స్వామీజీ నామినేషన్ వేయడంతో త్రిముఖ పోటీ తప్పదని అంచనా వేస్తున్నారు.