తెలంగాణపై బీజేపీ ఎక్కువగా ఫోకస్ పెడుతున్న సమయంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఈ నెల 8న తెలంగాణ… హైదరాబాద్‌కి రానుండటం చర్చనీయాంశం అయ్యింది. ఈ పర్యటనలో ప్రధాని ప్రధానంగా రైల్వే అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టనున్నారు. అందులో భాగంగా 8న సికింద్రాబాద్-తిరుపతి మధ్య పరులుగు పెట్టనున్న వందే భారత్ రైలును ప్రారంభిస్తారు.
ఈ వందే భారత్.. ఆయా స్టేషన్లలో ఎక్కువసేపు ఆగదు కదా.. అందువల్ల ఇది 8.30 గంటల్లో గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. ఇది నల్గొండ, , ఒంగోలు, స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. 8న మాత్రం నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడురు స్టేషన్లలో ఆగుతూ వెళ్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇది రెండో వందే భారత్ కావడం వల్ల దీని కోసం అంతా ఎదురు చూస్తున్నారు.