భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతి నెల చివరి ఆదివారం రేడియో ద్వారా చేసే ‘మన్ కీ బాత్’ వందో ఎపిసోడ్ కు చేరుకుంది. వందో ఎపిసోడ్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయాలని బిజెపి నిర్ణయించింది. ఏప్రిల్ చివరి వారంలో మోదీ చేసే ప్రసంగంతో ఈ కార్యక్రమం 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఎపిసోడ్‌ను ప్రపంచవ్యాప్తంగా వినిపించాలని నిర్ణయించింది. అంతేకాదు, మోడీ తన ‘మన్ కీ బాత్’లో ఇప్పటి వరకు ప్రస్తావించిన వ్యక్తులను ఢిల్లీకి ఆహ్వానించి సత్కరించనుంది. అలాగే, దేశవ్యాప్తంగా 100 ప్రాంతాలను ఎంపిక చేసి, అక్కడ ఉన్న 100 మంది ప్రముఖులను ఆహ్వానించి ‘మన్ కీ బాత్’ వినిపిస్తారు. బిజెపికి చెందిన 100 బూత్‌లలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వినిపిస్తారు. 3 అక్టోబరు 2014లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఏప్రిల్ 30తో వంద ఎపిసోడ్లు పూర్తి చేసుకుంటుంది.
మన్ కీబాత్ వందో ఎపిసోడ్‌కు భారీగా ఏర్పాట్లు చేయాలని అన్ని పార్టీల రాష్ట్ర శాఖలు నిర్ణయించాయి. భారీ ఏర్పాట్లు చేయాలి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గ్రామ స్థాయిలో ప్రజలంతా ఆ కార్యక్రమం వినేలా చూడాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మనసులొమాట కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీబాత్ పేరుతో ప్రసారం అవుతోంది. ఈ ఆదివారం జరిగే కార్యక్రమం వందో ఎపిసోడ్ కావటంతో బీజేపి నేతలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
పల్లె పల్లెలో మోదీ నినాదం మారుమోగిలా మన్‌కీబాత్‌పై చర్చ జరిగేలా ప్లాన్ చేస్తోంది ఏపీ బీజేపీ. దీని కోసం ముందస్తు ఏర్పాట్లలో మునిగిపోయిందా నాయకత్వం. ఇప్పటికే గ్రామ స్థాయిలో అందరూ ఈ కార్యక్రమాన్ని వినేలా చూసేలా చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు నేతలకు దిశానిర్దేశం చేశారు. పోలింగ్ బూత్ స్ధాయిలో మన్ కీబాత్ వందో ఎపిసోడ్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలతో మమేకమయ్యే అధ్భుత కార్యక్రమం అని బీజేపీ నేతలు అంటున్నారు.
మన్ కీ బాత్‌లో అనేక సందర్భాల్లో మన రాష్ట్రం గురించి, వ్యక్తుల గురించి, ఇతర అంశాలపై కూడా ప్రస్తావించారు. క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించి మన్ కీ బాత్ వందో ఎపి సోడ్‌లో అందరినీ భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు.