ప్రధాని మోదీ ఇంట గెలుస్తారు.. రచ్చ గెలుస్తారు. మన దేశ ప్రయోజనాల్ని కాపాడుతూ రియల్ పెద్దన్నలాగా ఇతర దేశాలకు మద్దతుగా నిలవడంతోనూ ఆయన స్టైల్ వేరు. అందుకే ఆయనకు ప్రపంచవ్యాప్త నేతగా గుర్తింపు లభిస్తోంది. బైడెన్ వంటి నేత సైతం ఆటోగ్రాఫ్ అడగాల్సిన పరిస్థితి వచ్చింది. కింది స్థాయి నుంచి ఎదిగిన ఓ నేత ఇలా ప్రపంచాన్ని ప్రభావితం చేయడం సంచలనమే. అది నరేంద్రమోదీకి సాధ్యమయింది.
9 ఏళ్లలో ఎన్నో అంతర్జాతీయ పురస్కారారాలు !
నరేంద్ర మోదీ ఈ తొమ్మిదేళ్లలో ఎన్నో అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ఇటీవలే మోదీ… ఫిజీ దేశ అత్యున్నత పురస్కారం ది కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫిజీ తో సత్కరించిన విషయం తెలిసిందే. అదే రోజు పాపువా న్యూ గినియా కూడా తమ దేశ అత్యున్నత పురస్కారం ‘కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ లోగోహు’’ మోదీకి ప్రదానం చేసింది. అలాగే, 2021లో ఆర్డర్ ఆఫ్ ది డ్రాగన్ కింగ్ ను మోదీకి ప్రధానం చేసింది భూటాన్. 2016 నుంచి 2023 మే మధ్య మోదీ మొత్తం 11 దేశాల పురస్కారాలు అందుకున్నారు. అందులో అమెరికా “లెజియన్ ఆఫ్ మెరిట్” పురస్కారం, రష్యా ప్రదానం చేసిన ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ కూడా ఉన్నాయి.
అంతర్జాతీయంగా పెరిగిన భారత కీర్తి ప్రతిష్టలు
ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో జరిగిన బహిరంగ చర్చకు అధ్యక్షత వహించే అరుదైన అవకాశాన్ని ప్రధాని మోదీ పొందారు. గతంలో ఈ అవకాశం ఏ భారత ప్రధానికి లభించలేదు. ఐక్యరాజ్య సమితిలో స్వచ్ఛమైన హిందీలో ప్రసంగించిన తొలి భారత నేతగా చరిత్ర సృష్టించారు. 2014 నుంచి మోదీ విదేశాంగ విధానంలో పొరుగు దేశాలకు పెద్ద పీట వేశారు. విదేశాలతో సంబంధాలు ప్రభావితం కాకూండానే భారత్ సొంత కాళ్లపై నిలబడేందుకు మోదీ తీసుకున్న చర్యలు దేశాన్ని ఉన్నతంగా నిలబెట్టాయి. దౌత్యం, రాజకీయాలే మోదీ బలమని అందరూ చెబుతుంటారు. ఆర్థిక వ్యవహారాల విషయంలో మోదీ మరింత తెలివిగా వ్యవహరించారు. దేశ ప్రయోజనాలకు భంగం కలగకుండా.. ఇతర దేశాలతో సంబంధాలు మెయిన టెయిన్ చేశారు.దీనికి రష్యా నుంచి చమురు దిగుమతుల విధానమే గొప్ప సాక్ష్యం.
ప్రపంచానికి యోగాను విస్తృతంగా పరిచయం చేసిన మోదీ
ప్రపంచవ్యాప్తంగా 192 దేశాల్లో ఆదివారం తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. జీవనశైలిలో పెరిగిన వేగం కారణంగా ఏర్పడుతున్న మానసిక ఒత్తిళ్లవల్ల పలు రుగ్మతల బారిన పడుతున్న వారికి ఉపశమనం కలిగించే…స్వస్థత చేకూర్చే ఈ ప్రక్రియను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదని మన దేశం చేసిన ప్రతిపాదనకు ఐక్య రాజ్యసమితిలోని మెజారిటీ సభ్యదేశాలు ఆమోదం తెలిపారు. ఇది మోదీ పలుకుబడి ద్వారానే సాధ్యమయింది. ఒక దేశం చేసిన ప్రతిపాదనలో 177 దేశాలు సహభాగస్తులు కావడం అదే తొలిసారి. అందులో అఫ్ఘాన్, టర్కీ, ఇరాన్, ఇండొనేసియా, ఖతార్, ఒమన్‌వంటి 47 ఇస్లామిక్ దేశాలు కూడా ఉండటం మరో అపురూప దృశ్యం. దేనికైనా హర్షామోదాలు లభించినట్టే శంకలూ, సందేహాలూ కూడా తప్పవు. ఇది మోదీ ద్వారానే సాధ్యమయిందని చెప్పాల్సిన పని లేదు.
ప్రపంచంలో అందరికీ ఆమోదయోగ్యమేైన నేత మోదీ
ప్రపంచంలో అన్ని దేశాల ప్రజల్లో క్రేజ్, ఆమోదం తెచ్చుకున్న నేత మోదీ. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, భారతదేశం, ఇటలీ, జపాన్, మెక్సికో, దక్షిణ కొరియా, స్పెయిన్, బ్రిటన్, అమెరికా దేశాల నేతల కన్నా మోదీకే ఎక్కువ ప్రజాదరణ ఉందని అనేక నివేదికలు వెల్లడించాయి. అందుకే మోదీని ప్రపంచం మెచ్చిన నేతగా చెబుతారు.