ప్రకాశం జిల్లాలో వైసీపీ పంచాయతీలో విజయసాయిరెడ్డి కొత్త పుల్ల పెట్టారు. ఆయన మాగుంట, బాలినేనిల పక్షాన చేరిపోయారు. వైవీ సుబ్బారెడ్డికి చెక్ పెట్టాలని డిసైడయ్యారు. ఇక నుంచి ప్రకాశం జిల్లా మొత్తాన్ని బాలినేని శాసిస్తారని ఒంగోలులో మీడియా సమావేశం పెట్టి ప్రకటించారు. దీంతో వైసీపీలో రగులుతున్న అసంతృప్తి ఏ దిశగా వెళ్తుందన్న చర్చ ప్రారంభమయింది.
ఒక్కటైన బాలినేని, విజయసాయిరెడ్డి
వైసీపీలో బాలినేని, విజయసాయిరెడ్డి ఒకటయ్యారు. వైవీ సుబ్బారెడ్డిని టార్గెట్ చేయడం ప్రారంభించారు. కోస్తా జిల్లాల ఇంచార్జ్ గా విజయసాయిరెడ్డి నియమితులు కావడంతో ఆయన సమీక్షలు ప్రారంభించారు. ఒంగోలు వెళ్లి పార్టీ నేతలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన బాలినేని కనుసన్నల్లోనే పార్టీ నడుస్తుందని ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ ప్రస్తావన తీసుకు రాలేదు.. వైవీ సుబ్బారెడ్డి అంశాన్నీ పరిగణనలోకి తీసుకోలేదు.
ఒంగోలు తనదేననుకుంటున్న వైవీ సుబ్బారెడ్డి
బాలినేని, వైవీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. వైవీ సుబ్బారెడ్డి రాజకీయంగా ప్రకాశం జిల్లాలను తన గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇది బాలినేనికి నచ్చడం లేదు. జగన్ రెడ్డికి చెప్పినా పట్టించుకోకవడంతో ఆయన తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు పార్లమెంట్ కు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ అక్కడ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఉన్నారు. ఇప్పుడు మాగుంట, బాలినేని ఒక్కటయ్యారు. ఇద్దరమూ పోటీ చేస్తామని బాలినేని చెబుతున్నారు. దీంతో వైసీపీలో చిచ్చు ముదిరి పాకాన పడుతున్నట్లుగా అయింది.
వైవీకి విజయసాయిరెడ్డికి వైజాగ్ విబేధాలు
విజయసాయిరెడ్డికి, వైవీ సుబ్బారెడ్డికి మధ్య కూడా సత్సంబంధాలు లేవు. విశాఖ వ్యవహారంలో ఇద్దరూ పట్టుదలకు పోయారు. ఇటీవలి కాలం వరకూ విశాఖకు విజయసాయిరెడ్డి ఇంచార్జ్ గా ఉండేవారు. ఇప్పుడు కూడా ఆయనే ఇంచార్జ్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. విజయసాయిరెడ్డి విశాఖపై పెత్తనం చేస్తున్నారు. అందుకే విజయసాయిరెడ్డి ప్రకాశం జిల్లాలో తన పవర్ చూపిస్తున్నారు. మొత్తంగా బాలినేని, విజయసాయిరెడ్డి, మాగుంట ఒక గ్రూప్ అయ్యారు. వైవీ సుబ్బారెడ్డి.. వారికి వ్యతిరేకమయ్యారు. ఇప్పుడు ప్రకాశం వైసీపీలో ఏం జరుగుతుందనేది కీలకంగా మారింది.