ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా ప్రతీ రోజూ ఏదో ఓ కుట్ర జరుగుతూనే ఉంటుంది. బీజేపీ మాకు దగ్గర అని చెప్పుకోవడానికి నర్మగర్భంగా వైసీపీ.. ఆ పార్టీకి దగ్గర అనిచెప్పడానికి టీడీపీ ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఇలా ఆన్వయించే బీజేపీపై అతి పెద్ద కుట్ర చేస్తున్నారు. భారతీయ జతా పార్టీ ఓట్లను.. ఇతర పార్టీలకు మళ్లించే వ్యూహంలో భాగంగానే ప్రాంతీయ పార్టీలు రెండూ కూడబలుక్కుని ఇలాంటి కుట్రలు బీజేపీపై చేస్తున్నాయన్న అభిప్రాయం రాజకీయ నిపుణుల్లో వ్యక్తమవుతున్నాయి.
2019 ఎన్నికల్లోనే మహా కుట్ర !
ఉమ్మడి ఏపీలో భారతీయ జనతా పార్టీకి తిరుగులేని బలం లేకపోయినప్పటికీ బలహీనమైన పార్టీ అని ఎవరూ చెప్పరు. ఎందుకంటే.. ఒకానొక దశలో..బీజేపీకి 18 శాతం ఓట్ల బలం ఉంది. ఇప్పటికి బీజేపీ సానుభూతి పరులు ప్రతి గ్రామంలోనూ ఉంటారు. బీజేపీకి కనీసం ఎనిమిది శాతం ఓటు బ్యాంక్ ఉంటుందని శాస్త్రీయమైన అంచనాలు ఉన్నాయి. వీరంతా బీజేపీ సానుభూతిపరులే. కానీ రెండు ప్రాంతీయ పార్టీలు కలిసి ఆడుతున్న రాజకీయ నాటకంలో బీజేపీని వ్యూహాత్మకంగా టార్గెట్ చేస్తున్నారు. బీజేపీ ఓటర్లను ఎవరో ఒకరి వైపు మళ్లించుకుంటున్నారు. ఇందుకు 2019లోనే మహా కుట్ర జరిగింది.
వైసీపీ వైపు బీజేపీ ఓట్లు మళ్లించేలా రాజకీయ వ్యూహం !
2014 ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోవడం ద్వారా గరిష్ట ప్రయోజనం పొందిన టీడీపీ.. తర్వాత నాలుగేళ్లకు బీజేపీకి గుడ్ బై చెప్పింది. ఆ తర్వాత బీజేపీ ఓట్లు వైసీపీకి పడేలా.. ఆ రెండు పార్టీలు ఒకటేనన్న ప్రచారం ఉద్ధృతం చేశారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా అది వైసీపీకి అనుకూలంగా ఉందన్న అభిప్రాయాన్ని ఉద్ధృతంగా కలిగేలా చేశారు .చివరికి బీజేపీకి ఓటేస్తే.. ఓట్లు చీలిపోయి టీడీపీకి మేలు కలుగుతుందని.. వైసీపీకి ఓటేస్తే లక్ష్యం నెరవేరుతుందని బీజేపీ ఓటర్లు కూడా అనుకునే పరిస్థితి తీసుకు వచ్చారు. ఫలితంగా బీజేపీకి ఒక్క శాతం ఓట్లు మాత్రమే గత ఎన్నికల్లో వచ్చాయి. ప్రాంతీయ పార్టీల ప్లాన్ సక్సెస్ కావడంతో ఈ సారి కూడా అదే చేస్తున్నారు.
కేంద్రం సహకరిస్తోంది ఏపీకి.. వైసీపీకి కాదు !
కేంద్రానికి రాజ్యాంగపరమైన బాధ్యతలు ఉంటాయి. ఆ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తారు .అంత మాత్రాన.. రాజకీయంగా బీజేపీ, వైసీపీ ఒకటే కాదు.కానీ అలా ప్రచారం చేస్తారు. చాలా రోజులుగా ఈ తతంగం జరుగుతోంది. అలా అయితే బెంగాల్ లో .. తెలంగాణలో.. తమిళనాడులో కూడా.. ఆయా పార్టీలు బీజేపీకి అనూకలమైపోవాలి. బీజేపీ.. అక్కడి అధికార పార్టీలు ఒక్కటే అవ్వాలి. కానీ ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు. అక్కడ రాజకీయాలు వేరు. ఇక్కడ రాజకీయాలు వేరు.
ఈ కుట్రలను చేధించేందుకు ఏపీ బీజేపీ నేతలు విస్తృతంగా శ్రమించాల్సి వస్తోంది. కానీ బలమైన మీడియా ఏపీ బీజేపీకి వ్యతిరేకంగా ఉండటంతో వారి ప్రయత్నాలు పెద్దగా సత్ఫలితాలు ఇవ్వడం లేదు. ఈ సారి మాత్రం కుట్రల్ని చేధిస్తామంటున్నారు.