ఓటు బ్యాంకు రాజకీయాలంటే ప్రధాని మోదీకి అసహ్యం. బీజేపీ ఎప్పుడు అలాంటి చీప్ పాలిటిక్స్ కు దిగదని ఆయన తరచూ కుండబద్దలు కొడతారు. ఇస్లాంను విశ్విసించే సోదరులంతా భారత దేశంలో అంతర్భాగమేనని ఆయన చెబుతారు. హిందూ, ముస్లింలు సఖ్యతగా ఉంటూ, దేశాభివృద్ధిలో భాగం కావాలని బీజేపీ వాదిస్తుంది.
జాతీయ రాజకీయాల్లో మీ పాత్రను నిర్వచించుకోండి…
కాంగ్రెస్ పార్టీ తీరుపై ప్రధాని మోదీ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. దేశ ముస్లింల పట్ల బీజేపీకి ఉన్న బాధ్యతను ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ హిందూ, ముస్లిం విభజనను తెస్తోందని ఆయన మరోసారి ఆరోపించారు. దేశంలో ఇంతకాలం జరిగిందేమిటో అర్థం చేసుకోవాలని ముస్లిం సమాజానికి, ముఖ్యంగా చదువుకున్న మేథావులకు ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ పథకాలు వారికి ఎందుకు అందలేదో అధ్యయనం చేసుకోవాలన్నారు. ముస్లింలు పడిన కష్టాలను వారే సమీక్షించుకోవాలన్నారు….
మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి..
కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో పడిపోతే నష్టపోతారని ముస్లిం సమాజానికి ప్రధాని మోదీ హితబోధ చేశారు. “మీ భవిష్యత్తుపై ఎక్కువ దృష్టి పెట్టండి, మీ పిల్లల భవిష్యత్తు ఏమిటో ఆలోచించండి. ఏ వర్గమూ వెట్టిచాకిరికి బలికాకూడదన్నది నా ఉద్దేశం. ఎవరూ భయపడుతూ బతకాల్సిన పనిలేదు…” అని మోదీ ఆ ఇంటర్వ్యూలో అన్నారు..
మైనార్టీలకు కూడా ఆయనే ఆశాకిరణం…
మోదీ తాజా ప్రకటనను సామాజిక మాధ్యమాల్లో చాలా మంది భారతీయులు ప్రశంసిస్తున్నారు. బీజేపీ తీరుపై అపోహ పడుతున్న వారికి ఇదీ కనువిప్పు అని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. మోదీ మాత్రమే అంత ఓపెన్ గా మాట్లాడగలరని కితాబిస్తున్నారు. 70 ఏళ్లుగా ఎవరూ మాట్లాడని అంశాన్ని ప్రధాని టచ్ చేశారని వారంటున్నారు. ఇండియా గ్రూపు మతాల మచ్చ చిచ్చు పెట్టి ఇంతకాలం మనుగడసాగించిందని వాళ్లు ఒప్పుకుంటున్నారు.ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావడం మోదీ వల్లే సాధ్యమని వారు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ చూపిన అభివృద్ధితో భయపడిపోయిన కాంగ్రెస్ పార్టీ…ఇప్పుడు ముస్లింలను రెచ్చగొట్టేందుకు కూడా భయపడుతోందని జనం అంగీకరిస్తున్నారు. ప్రధాని మోదీ మరో విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఇళ్లస్థలాలు, గ్యాస్ కనెక్షన్లు ఏమైనా సరే ముస్లింల పట్ల తమ ప్రభుత్వం ఎప్పుడూ వివక్ష చూపలేదని ఆయన అన్నారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు అందుతున్నాయని ఆయన అన్నారు. అలాంటప్పుడు మైనార్టీలను వేరుగా చూడాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నిస్తున్నారు…